iDreamPost
android-app
ios-app

తండ్రి దారుణం.. పొలం అడిగాడని పెద్ద కొడుకుతో కలిసి చిన్న కుమారుడిని..

ఆస్తి ఆ తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. పొలం కారణంగా కన్న కొడుకు ప్రాణం తీశాడు తండ్రి. పెద్ద కొడుకుతో కలిసి చిన్న కొడుకును అంతమొందించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

ఆస్తి ఆ తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. పొలం కారణంగా కన్న కొడుకు ప్రాణం తీశాడు తండ్రి. పెద్ద కొడుకుతో కలిసి చిన్న కొడుకును అంతమొందించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

తండ్రి దారుణం.. పొలం అడిగాడని పెద్ద కొడుకుతో కలిసి చిన్న కుమారుడిని..

తులం బంగారం పోయిన పర్లేదు కానీ, అంగుళం భూమి మాత్రం వదులు కోవడం లేదు జనాలు. భూమి కోసం రక్తాలు చిందిస్తున్నారు. రక్త సంబంధాలను అంతమొందిస్తున్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల్ల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఆస్తుల కోసం పరస్పర దాడులతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆప్తులు కాదు ఆస్తులే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆస్తుల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. భూమి కోసం కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి. ఆస్తి కోసం కొడుకులు తండ్రులను చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. డబ్బు కోసం తల్లిని హతమార్చిన కొడుకులు ఉన్నారు.

బంధాలు బంధుత్వాలతో సంబంధం లేకుండా అత్యాశకు పోయి అయినవారిని దూరం చేసుకుంటున్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి. తాజాగా ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కొడుకు ఆస్తి అడుగుతున్నాడని ఏ తండ్రి చేయని పని చేశాడు. పెద్ద కొడుకుతో కలిసి చిన్న కుమారుడిని అంతమొందించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన జరిగి 24 రోజులు అవుతుండగా నిందితులు పోలీసులకు లొంగిపోవడంతో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సాధారణంగా ఏ తండ్రైనా తాను సంపాదించిన ఆస్తిపాస్తులను తన పిల్లలకే దక్కాలని చూస్తాడు. కానీ ఈయన మాత్రం కొడుకు పొలం అడిగినందుకు ఆ పొలంలోనే పాతిపెట్టాడు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గుడితండాకు చెందిన రాత్లావత్‌ లక్ష్మణ్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వీరందరికీ వివాహాలు జరిపించాడు. కాగా లక్ష్మణ్‌ పెద్దకుమారుడు నరేష్, చిన్న కొడుకు సురేష్‌ (25)తో కలసి కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ముగ్గురూ కూడా ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దసరా పండుగకు సొంతూరు గుడితండాకు వెళ్లారు. ఇంట్లో అందరు ఉండగా ఆస్తి కోసం వివాదం చోటుచేసుకుంది. ఉన్న ఆస్తిని తన పేరు మీద రాయాలని సురేష్ తండ్రి లక్ష్మణ్ ను బెదిరించాడు. దీంతో తండ్రి లక్ష్మణ్ ఆగ్రహానికి గురయ్యాడు. కొడుకుపై కక్ష పెంచుకుని అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

అక్టోబర్‌ 13న రాత్రి పెద్ద కొడుకు నరేష్‌తో కలిసి మాంసం కొట్టే కత్తితో చిన్న కుమారుడు సురేష్‌ (25)ను అంతమొందించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఆటోలో తీసుకుపోయి సమీపంలో ఉన్న పొలంలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లిపోయారు. కాగా హత్య చేసిన 24 రోజుల తర్వాత లక్ష్మణ్, నరేష్‌ ఇద్దరూ బుధవారం(నవంబర్8) సాయంత్రం మాడ్గుల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పొలం అడిగినందుకు కన్న కొడుకునే చంపి పొలంలో పాతిపెట్టిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.