iDreamPost
android-app
ios-app

పుష్పరాజ్ తో చావా పోటీ క్యాన్సిల్.. ఇప్పుడు చరణ్ తో ?

  • Published Nov 09, 2024 | 5:37 PM Updated Updated Nov 09, 2024 | 5:37 PM

కానీ పుష్ప 2 కు పోటీగా నార్త్ లో ఓ సినిమా పేరు మొన్నటివరకు బాగా వినిపించింది.ఆ సినిమా మరేదో కాదు. బాలీవుడ్ పాన్ ఇండియా మూవీ చావా. పుష్ప 2 తో పాటే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా పోస్టుపోన్ దాదాపు ఖరారైనట్లే.

కానీ పుష్ప 2 కు పోటీగా నార్త్ లో ఓ సినిమా పేరు మొన్నటివరకు బాగా వినిపించింది.ఆ సినిమా మరేదో కాదు. బాలీవుడ్ పాన్ ఇండియా మూవీ చావా. పుష్ప 2 తో పాటే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా పోస్టుపోన్ దాదాపు ఖరారైనట్లే.

  • Published Nov 09, 2024 | 5:37 PMUpdated Nov 09, 2024 | 5:37 PM
పుష్పరాజ్ తో చావా పోటీ క్యాన్సిల్.. ఇప్పుడు చరణ్ తో ?

ఏదైనా భారీ బడ్జెట్ సినిమా భారీ అంచనాల మధ్యన రిలీజ్ అవుతుందంటే.. దానికి పోటీగా మరే సినిమా రిలీజ్ చేయరు. కానీ పుష్ప 2 కు పోటీగా నార్త్ లో ఓ సినిమా పేరు మొన్నటివరకు బాగా వినిపించింది. ఈ సినిమా బ్యాక్డ్రాప్ కాస్త ఎమోషనల్ గా ఉండడంతో.. అభిమానులలో కాస్త కంగారు మొదలైంది. ఎక్కడ ఆ సినిమా వలన పుష్ప 2 కలెక్షన్స్ దెబ్బ తింటాయా అనే సందేహాలు వచ్చాయి. ఆ సినిమా మరేదో కాదు. బాలీవుడ్ పాన్ ఇండియా మూవీ చావా. పుష్ప 2 తో పాటే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా పోస్టుపోన్ దాదాపు ఖరారైనట్లే. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఇప్పటివరకు ప్రమోషన్స్ గురించి కూడా టాక్ లేకపోవడంతో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే అని సమాచారం. ముందు చెప్పిన ప్రకారం డిసెంబర్ 6 కు ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ పుష్ప 2 క్లాష్ వలన ఓపెనింగ్స్ ఇబ్బంది అవుతాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

సరే పుష్ప 2 సినిమా ఎఫెక్ట్ వారి సినిమా మీద పడకుండా పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో బన్నీ తో పోటీ క్యాన్సిల్. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది . కానీ అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పుడు ఈ సినిమా చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్ కానుందని కొత్త రిలీజ్ డేట్ వినిపిస్తుంది. నిజానికి డిసెంబర్ 6 కాకపోతే డిసెంబర్ 20 న ఆప్షన్ గా అనుకున్నారు. కానీ అదే రోజు ముఫాసా లయన్ కింగ్ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సినిమాను తక్కువ అంచనా వేయడానికి లేదు. దీనితో ఇది కాస్త సంక్రాంతికి షిఫ్ట్ అయింది. జనవరి 10 న చావా రిలీజ్ ఉంటుందని బజ్ వినిపిస్తుంది. అది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ డేట్ . చరణ్ కు నార్త్ లో ఇమేజ్ బాగానే ఉంది. కానీ శంకర్ కు అక్కడ అంత ఎఫెక్టీవ్ బ్రాండ్ లేదు. సో అంత ఇబ్బంది ఉండదని భావించి చావా టీం ఆ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్సుమెంట్ త్వరలోనే ఇవ్వనున్నారు.

అసలే చరణ్ సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్యలో దిగుతున్నాడు. ఈ సినిమా మీద ఓ మేరకు అంచనాలు ఉన్నా కానీ.. కలెక్షన్స్ విషయంలో కాస్త సందేహాలు అలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు సీన్ లోకి చావా ఎంటర్ అయింది. దీనితో మెగా అభిమానులకు గేమ్ చెంజర్ రిలీజ్ అయ్యేవరకు టెన్షన్ తప్పేలా లేదు. పుష్ప విషయంలో అయితే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ , అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతుంది. ఎలా అయినా సరే నెక్స్ట్ వచ్చే సినిమాలకు గట్టి టార్గెట్ ను ఫిక్స్ చేసే కసితోనే బరిలోకి దిగుతుంది. మరి పుష్ప ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో.. మిగిలిన సినిమాల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş