iDreamPost
android-app
ios-app

Allu Arjun: రెమ్యూనరేషన్ విషయంలో బన్నీ టాప్ రికార్డ్.. ఎన్ని కోట్లంటే ?

  • Published Nov 09, 2024 | 5:44 PM Updated Updated Nov 09, 2024 | 5:44 PM

Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి రికార్డ్ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దాని గురించి తెలిస్తే వామ్మో అనాల్సిందే.

Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి రికార్డ్ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దాని గురించి తెలిస్తే వామ్మో అనాల్సిందే.

  • Published Nov 09, 2024 | 5:44 PMUpdated Nov 09, 2024 | 5:44 PM
Allu Arjun: రెమ్యూనరేషన్ విషయంలో బన్నీ టాప్ రికార్డ్.. ఎన్ని కోట్లంటే ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 పై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజు రోజుకి ఈ సినిమా పై అంచనాలు పెరగడమే తప్ప ఏమాత్రం తగ్గట్లేదు. రోజుకో వార్తతో పుష్ప సెన్సేషనల్ అవుతుంది. ఈ సినిమాతో బన్నీ కేవలం పాన్ ఇండియా మార్కెట్ నే కాదు పాన్ వరల్డ్ మార్కెట్ ని కూడా షేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఏదోక వార్తతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. తాజాగా ఇంకో వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త తెలిసిన అభిమానులు ఇదిరా మా బన్నీ రేంజ్ అని కాలర్ ఎగరేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

మన ఐకాన్ స్టార్ రెమ్యూనరేషన్ విషయంలో రికార్డుల్ని బ్రేక్ చేశాడ‌ని టాక్ వినిపిస్తోంది. అంద‌రి కంటే టాప్ లో ఉన్నాడనే టాక్ ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో సెగలు రేపుతుంది. మనకు తెలిసిందే పుష్ప 2 కోసం బన్నీ రెండు సంవత్సరాల నుంచి ఒళ్ళు హూనం అయ్యేలా కష్టపడుతున్నాడు. సుకుమార్ ఈ సినిమాని ఓ రేంజిలో శిల్పి జక్కన్న లా చెక్కుతున్నాడు. సినిమా కోసం బన్నీ ఎంత కష్టం అయినా తగ్గేదెలే అంటున్నాడు. మరి ఇంత కష్ట పడుతున్న బన్నీ.. కష్టానికి తగ్గ ప్రతి ఫలం తీసుకోపోతే ఎలా? అందుకే ఈ సినిమాకి 100 కాదు 150 కాదు ఏకంగా 300 కోట్లు తీసుకుంటున్నాడ‌ని సమాచారం. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే 1000 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసి ఔరా అనిపించింది. ఇదంతా కూడా ఐకాన్ స్టార్ ప‌వ‌ర్ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బన్నీ థియేటర్ లో కనిపిస్తే చాలు ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునేలా పుష్ప 2 రేంజ్ ఉంది. దాంతో నిర్మాత‌లు బన్నీకి ఆ రేంజిలో క‌ట్ట‌బెడుతున్నార‌ని బ‌ల‌మైన టాక్ వినిపిస్తోంది.

ఒక‌వేళ ఈ వార్త నిజ‌మైతే ఇండియాలోనే అత్య‌ధిక పారితోషికం తీసుకునే యాక్టర్స్ లిస్టులో అల్లు అర్జున్ టాప్ లో ఉన్నట్టే. ఈ వార్తా నిజమైనా ఏమాత్రం ఆశ్చర్య పోనవసరం లేదు. ఎందుకంటే మన బన్నీ రేంజ్ అలా పెరిగింది. ప్రస్తుతం ఈ పారితోషికం నెటిజన్స్ క‌ళ్లు భైర్లు క‌మ్మేలా చేస్తుంది. పుష్ప 2 కి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు థియేట్రిక‌ల్ గా మినిమం 600 కోట్ల వసూళ్లు కుమ్మడం ఖాయం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి విడుదలకు ముందే సెన్సేషనల్ రికార్డ్స్ సృష్టిస్తున్న పుష్ప రాజ్ ఇక విడుదల తరువాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో మరి.. ఇదీ సంగతి .. ఇక ఐకాన్ స్టార్ తీసుకుంటున్న ఈ భారీ రెమ్యూనరేషన్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş