P Venkatesh
Aadhaar: ఆధార్ కార్డుదారులకు అలర్ట్. మీరు వెంటనే ఈ పని చేయకపోతే మీ ఆధార్ కార్డు రద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆధార్ తో ప్రయోజనాలు పొందాలంటే ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకండి.
Aadhaar: ఆధార్ కార్డుదారులకు అలర్ట్. మీరు వెంటనే ఈ పని చేయకపోతే మీ ఆధార్ కార్డు రద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆధార్ తో ప్రయోజనాలు పొందాలంటే ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకండి.
P Venkatesh
ఆధార్ కార్డు దేశ పౌరులకు ముఖ్యమైన ధృవపత్రంగా మారింది. ఈరోజుల్లో ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరం అవుతోంది. సిమ్ కార్డుల నుంచి బ్యాంకుల వరకు ఆధార్ నెంబర్ ఉండాల్సిందే. ఆధార్ కార్డు ద్వారా ప్రజలు అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. గుర్తింపు ధృవీకరణ పత్రంగా, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందాలన్నా.. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా మారింది. ఆస్తులు కొనడానికి అమ్మడానికి, వాహనాల కొనుగోలు చేయడానికి ఆధార్ కార్డులు కీలకంగా మారాయి. ఇది 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య. ఆధార్ కార్డుపై ఆ వ్యక్తికి సంబంధించిన పేరు, అడ్రస్, వయసు వంటి వివరాలు ఉంటాయి. ఆధార్ కార్డు లేకపోతే పౌరులు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది.
ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డ్ ఉన్నవారికి బిగ్ అలర్ట్ ఇచ్చింది. వెంటనే ఈ పని చేయకపోతే మీ ఆధార్ కార్డ్ రద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. గత కొంత కాలం నుంచి యూఐడీఏఐ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. 10 సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోని వారు త్వరగా చేసుకోవాలని గడువు విధించింది. ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు ఈ ఏడాది డిసెంబర్ 14 వరకు అవకాశమిచ్చింది. ఆ తర్వాత అప్‌డేట్ చేయనివారి ఆధార్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయవచ్చు. కాబట్టి అప్ డేట్ చేయని ఆధార్ కార్డులను గడువులోపు అప్‌డేట్ చేసుకోవడం చాలా అవసరం. ఇప్పటికీ అప్ డేట్ చేసుకోని వారు చాలామందే ఉన్నారు.
అలాంటి వారు వెంటనే అప్ డేట్ చేసుకోండి. ఆధార్ కార్డులో ఫోటో, చిరునామా మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి. ఉచిత సేవలు ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, సీజీహెచ్‌ఎస్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను ఉపయోగించుకుని ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత అప్ డేట్ చేసుకుంటే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చింది. ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. మొదట మార్చి 14, ఆపై జూన్ 14, ఆ తర్వాత సెప్టెంబర్ 14 గడువు విధించగా ఇప్పుడు డిసెంబర్ 14 వరకూ అవకాశం ఇచ్చింది. మరోసారి కేంద్రం ఆధార్ ఉచిత అప్ డేట్ కు గడువు పొడిగిస్తుందో లేదో అన్నది తెలియాల్సి ఉంది.