P Venkatesh
Suryakumar Yadav: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఆవేశంతో ఊగిపోయాడు. సఫారీ ఆటగాళ్లకు దడ పుట్టించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
Suryakumar Yadav: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఆవేశంతో ఊగిపోయాడు. సఫారీ ఆటగాళ్లకు దడ పుట్టించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
P Venkatesh
క్రికెట్ అంటే ఓ ఎమోషన్. ఎక్కడ మ్యాచ్ జరిగినా క్రికెట్ లవర్స్ రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. తమ టీమ్ ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ గా నిలుస్తారు. కాగా మ్యాచ్ లో గెలిచేందుకు ఆటగాళ్లు ప్రత్యర్థులను రెచ్చగొడుతుంటారు. మాటలతో కవ్విస్తుంటారు. స్లెడ్జింగ్ కు పాల్పడుతుంటారు. గ్రౌండ్ లో గెలుపు కోసం క్రికెటర్స్ చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి స్లెడ్జింగ్ హద్దులు దాటి గొడవలకు దారితీస్తుంది. ఇదే తరహాలో సౌతాఫ్రికా టీమిండియా మధ్య జరిగిన టీ20లో ఘర్షన చోటుచేసుకుంది. మిస్టర్ 360 దూకుడుగా వ్యవహరించాడు. గ్రౌండ్ లో అగ్రెస్సివ్ గా కనిపించి సఫారీలకు దడ పుట్టించాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే?.. సంజు శాంసన్‌తో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జేన్స్ గొడవకు దిగాడు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఆవేశంతో వచ్చి జేన్సన్ కు దడపుట్టించాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న అంపైర్ కలుగ చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశాడు. అసలు గొడవకు కారణం ఏంటంటే?.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో రెండో బాల్ కు శాంసన్ డేంజర్ ఏరియా నుంచి త్రోను అందుకున్నాడు. దీనిపై శాంసన్ తో జేన్సన్ గొడవపడ్డాడు. శాంసన్ ను జేన్సన్ రెచ్చగొట్టేలా చేశాడు. ఇది చూసిన సూర్యకుమార్ యాదవ్ ఆవేశంతో ఊగిపోయాడు. వెంటనే అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగాడు.
తోటి ప్లేయర్స్ కు అండగా నిలిచిన సూర్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా ప్లేయర్ల మధ్య ఐక్యత ఇలా ఉంటుందని సూర్య తీరుతో మరోసారి రుజువైంది. ఇక డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 61 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. టీమిండియా ఓపెనర్ సంజూశాంసన్ మెరుపు బ్యాటింగ్ తో సఫారీలపై విరుచుకుపడ్డాడు. తొలి టీ20లో సెంచరీతో విరుచుకుపడ్డాడు. శాంసన్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సులతో 107 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అదరగొట్టింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగులు చేసింది. సంజు శాంసన్ టాప్ స్కోరర్.
తిలక్ వర్మ (33; 18 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (21; 17 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా ఛేదనలో తడబడింది. టీమిండియా బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా జట్టులో హెన్రిచ్ క్లాసెన్ (25; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), కొయెట్జి (23; 11 బంతుల్లో, 3 సిక్సర్లు), రికెల్టన్ (21; 11 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. మరి సూర్య కుమార్ యాదవ్ గ్రౌండ్ లో ఆవేశంగా వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.