iDreamPost

గేమ్స్ కోసం ప్రత్యేకం.. 10000mAh బ్యాటరీతో గేమ్ కన్సోల్.. ఫోన్ అవసరం లేదు

T80 Game Console: మీకు వీడియో గేమ్స్ ఆడడం అంటే ఇష్టమా? అయితే మీకు ఈ డివైజ్ బాగా యూజ్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ కి గేమ్ కన్సోల్ ని కనెక్ట్ చేసి గేమ్ ఆడాలనేది మీ కల అయితే అది ఈ డివైజ్ ద్వారా నెరవేరుతుంది.

T80 Game Console: మీకు వీడియో గేమ్స్ ఆడడం అంటే ఇష్టమా? అయితే మీకు ఈ డివైజ్ బాగా యూజ్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ కి గేమ్ కన్సోల్ ని కనెక్ట్ చేసి గేమ్ ఆడాలనేది మీ కల అయితే అది ఈ డివైజ్ ద్వారా నెరవేరుతుంది.

గేమ్స్ కోసం ప్రత్యేకం.. 10000mAh బ్యాటరీతో గేమ్ కన్సోల్.. ఫోన్ అవసరం లేదు

వీడియో గేమ్స్ ఆడేవారికి స్మార్ట్ ఫోన్ లో కంటే కంప్యూటర్, ప్లే స్టేషన్ వంటి వాటిలో ఆడితేనే మజా వస్తుంది. అయితే ఫోన్ లో గేమ్స్ ఆడడం అంటే చిరాకు వస్తుంది. అలానే ల్యాప్ టాప్, కంప్యూటర్స్ లో ఆడినా గానీ ఆ కీబోర్డ్, మౌస్ తో కష్టంగా ఉంటుంది. అందుకోసం గేమ్ కంట్రోలర్స్ ని వాడుతుంటారు. అయినప్పటికీ అది అంత సౌకర్యంగా అనిపించదు. బెడ్ మీద వాలి ఆడడమో లేదా సోఫాలో కూర్చుని ఆడడమో ఇలా మనకు నచ్చిన పొజిషన్ లో కూర్చుని గేమ్ ఆడితే ఆ మజానే వేరు. అయితే అలా ఆడాలంటే ఫోన్ లోనే అవుతుంది. ఫోన్ కి గేమ్ కన్సోల్ ని కనెక్ట్ చేసుకోలేం. గేమ్ కన్సోల్ కి డిస్ప్లే రాదు. ఈ రెండు సమస్యలకు పరిష్కారమే ఈ టీజేడీ టీ80 గేమ్ కన్సోల్. ఇది గేమ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఫోన్, గేమ్ కన్సోల్ రెండూ కలిపి ఒకే డివైజ్ లో ఉంటే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది.

టీజేడీ టీ101 అనే రైజెన్ 7 77840యు బేస్డ్ గేమింగ్ హ్యాండ్ హెల్డ్ గేమ్ కన్సోల్ ని ప్రకటించి దాదాపు ఏడాది అవుతుంది. ఆ తర్వాత వెంటనే చిన్న టీజేడీ టీ80 హ్యాండ్ హెల్డ్ గేమ్ కన్సోల్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ టీజేడీ టీ80లో 8 అంగుళాల డిస్ప్లే వస్తుంది. టీజేడీ టీ101లో 10.1 అంగుళాల డిస్ప్లే సైజ్ తో రావాల్సింది. దాని బదులు 8 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేతో టీజేడీ టీ80 గేమింగ్ కన్సోల్ ని తీసుకొచ్చింది. ఇది 2048×1536 పిక్సెల్స్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. 224 పీపీఐ, 130% ఎస్ఆర్జీబీ కలర్ స్పేస్ కవరేజ్, 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. గేమింగ్ లవర్స్ కోసం దీన్ని 10 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో దీన్ని రూపొందించారు. అది కూడా యాక్టివ్ కూలింగ్ సొల్యూషన్ తో వస్తుంది. రెండు 2 వాట్ స్పీకర్స్ ఇచ్చారు.

బ్లూటూత్ 5.0, వైఫై 6ఈ కనెక్టివిటీతో వస్తుంది. అయితే ఇందులో వాడిన చిప్ సెట్ ఏంటో అనేది స్పష్టంగా తెలియదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో నెక్స్ట్ జెన్ ఫ్లాగ్ షిప్ అలాట్ చిప్ ని వినియోగించినట్లు తెలుస్తోంది. ఇది 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఇండీగోగో. కామ్ వెబ్ సైట్ లో దీన్ని 199 డాలర్లకు మన కరెన్సీ ప్రకారం 16,611 రూపాయలకు అందుబాటులో ఉంచింది. అది కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్. కంపెనీ ధర అయితే 299 డాలర్లు ఉంది. అంటే మన కరెన్సీ ప్రకారం 24,976 రూపాయలు.

ఇక 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్న డివైజ్ ని  ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 399 డాలర్లకు అంటే మన కరెన్సీ ప్రకారం 33,329 రూపాయలకు అందుబాటులో ఉంచింది. కంపెనీ ధర ప్రకారం 599 డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం 50 వేలుగా ఉంది. ఇప్పుడు కొనుగోలు చేస్తే ఆగస్టు నెలలో డెలివరీ అవుతుంది. ఇది నలుపు, తెలుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో లభిస్తుంది. వీడియో గేమ్స్ బాగా ఆడేవారికి ఈ గేమ్ కన్సోల్ బెస్ట్ ఛాయిస్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

Game console with battery 02

ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:

  • 8 అంగుళాల 2కే స్క్రీన్ రిజల్యూషన్
  • 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ స్పేస్, 8 జీబీ + 256 జీబీ స్టోరేజ్ స్పేస్
  • 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగా పిక్సెల్ రేర్ కెమెరా 
  • ఎక్కువ సేపు గేమ్స్ ఆడడం కోసం 10 వేల ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 13 లేదా 14 ఓఎస్ 

బటన్స్:

ఏ, బీ, ఎక్స్, వై బటన్స్, క్రాస్ కీ, లెఫ్ట్ స్టిక్ ఎల్ 3, రైట్ స్టిక్ ఆర్3, స్టార్ట్ మోడ్, హోమ్ సెలెక్ట్, హ్యాండిల్ ఆర్ 1, హ్యాండిల్ ఆర్ 2, హ్యాండిల్ ఎల్ 1, హ్యాండిల్ ఎల్ 2, వాల్యూమ్ +,- బటన్స్, ఎం 1, ఎం 2 బటన్స్ ఇచ్చారు. 

పవర్ సప్లై, ఇయర్ ఫోన్ స్టాండ్, కూలింగ్ అవుట్ లెట్, యూఎస్బీ-ఏ 3.0 పోర్ట్, కంప్యూటర్ మానిటర్ లేదా స్మార్ట్ టీవీని కనెక్ట్ చేసుకోవడానికి హెచ్డీఎంఐ అవుట్ పోర్ట్, టీఎఫ్ కార్డు, టైప్ సీ 3.0, 2 ట్రంపెట్స్, కెమెరా హీట్, ఫ్లాష్, డిస్సిపేషన్ ఇన్లెట్ వంటివి ఉన్నాయి. దీని బరువు కేవలం 630 గ్రాములు మాత్రమే. ట్యాబ్లెట్ కి, రెట్రో కన్సోల్ కి, గేమ్ కంట్రోలర్ కి, స్విచ్ వంటి పరికరాలన్నిటి కంటే ఈ టీ80 గేమ్ కన్సోల్ చాలా ఉత్తమం.

ఈ గేమ్ కన్సోల్ గురించి తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి