iDreamPost
android-app
ios-app

సరికొత్త లాక్ సిస్టం.. దొంగలు దొంగతనం చేయాలంటే.. వాళ్ళ తాతలు దిగి రావాల్సిందే!

Digital Lock System: ఇంటికి తాళం అనేది లేకపోతే దొంగలు పడి దొరికినకాడికి దోచుకుపోతారు. అయితే తాళం వేసి కొంతమంది తాళం చెవిని పారేసుకుంటారు. దీని వల్ల తాళం చెవి బద్దలుకొట్టాల్సి వస్తుంది. అయితే ఈ డిజిటల్ లాక్ ప్యాడ్స్ తో జస్ట్ మీ ఫింగర్ ప్రింట్ ఉంటే చాలు. తాళం చెవి పోతుందన్న భయం ఉండదు. పైగా ఈ లాక్ ని ఫింగర్ ప్రింట్ ఉన్నవారు తప్ప ఇంకెవరూ ఓపెన్ చేయలేరు.

Digital Lock System: ఇంటికి తాళం అనేది లేకపోతే దొంగలు పడి దొరికినకాడికి దోచుకుపోతారు. అయితే తాళం వేసి కొంతమంది తాళం చెవిని పారేసుకుంటారు. దీని వల్ల తాళం చెవి బద్దలుకొట్టాల్సి వస్తుంది. అయితే ఈ డిజిటల్ లాక్ ప్యాడ్స్ తో జస్ట్ మీ ఫింగర్ ప్రింట్ ఉంటే చాలు. తాళం చెవి పోతుందన్న భయం ఉండదు. పైగా ఈ లాక్ ని ఫింగర్ ప్రింట్ ఉన్నవారు తప్ప ఇంకెవరూ ఓపెన్ చేయలేరు.

సరికొత్త లాక్ సిస్టం.. దొంగలు దొంగతనం చేయాలంటే.. వాళ్ళ తాతలు దిగి రావాల్సిందే!

మనం మన ఇంటిని సెక్యూరిటీగా ఉంచుకోవాలి అంటే, ఎన్నో దశాబ్దాలుగా ఫాలో అవుతున్నది ఇంటికి తాళం వేయడం. మనం ఊర్లో లేకపోయినా, అలా కొంచెం సేపు బయటకు వెళ్ళినా కూడా, ఎవరు మన ఇంటిలోకి వెళ్ళకుండా ఈ లాక్ మన ఇంటిని ప్రొటెక్ట్ చేస్తుంది.. కాకపోతే ఈ తాళాలతో ఉన్న సమస్య ఏంటి అంటే తాళం చెవిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. పొరపాటున ఎక్కడైనా పడిపోతే ఇక అంతే. దాన్ని పగల కొట్టి ఇంకోటి చేయించుకోవాలి. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా మనుషులు ఉంటారు, కొందరివి చిన్న ఫామిలీస్ ఇద్దరే ఉంటారు, కానీ కొందరివి పెద్ద ఫామిలీస్ 5 గురు నుండి 7 వరకు కూడా ఉంటారు, కానీ అలాంటి ఫ్యామిలీలో అందరికీ ఒక్కో తాళం చెవి చేయించాలన్నా కూడా అది ఖర్చే. పైగా ఎవరు పోగొట్టుకున్నా ఇంకోటి చేయిస్తూనే ఉండాలి.

పొరపాటున పోయినా తాళం మన ఇంటిదే అని ఎవరికైనా తెలిసిన వాళ్ళకి దొరికితే, వాళ్ళు మనకి తెచ్చి ఇచ్చేస్తే పర్లేదు, కాని వారి దగ్గరే పెట్టుకుని మన ఇంట్లో వస్తువులు, డబ్బులు మనం లేనప్పుడు దొంగతనం చేస్తేనే ఇబ్బంది. వేసిన తాళం వేసినట్టే ఉంటుంది కాని ఎప్పుడూ ఏదో ఒకటి మాయం అవుతుంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కదా. ఇలాంటి ప్రాక్టికల్ సమస్యలకి చెక్ పెట్టాలని, ఇప్పుడు కొత్త డిజిటల్ లాక్స్ ని లాంఛ్ చేశారు. వీటిల్లో ఉన్న ప్రత్యేకతలతో పైన చెప్పిన సమస్యలకి ఒక సొల్యూషన్ వచ్చేసినట్టే. కాకపోతే వీటితో కూడా కొన్ని డిస్ కంఫర్ట్స్ ఉన్నాయి.. అసలు ఈ డిజిటల్ లాక్స్ లో ఉన్న పాజిటివ్స్, నెగెటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఈ డిజిటల్ లాక్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అంటే.. మనం ఈ మెషిన్ ని, మన డోర్ కి ఫిక్స్ చేసుకుంటే ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేయొచ్చు.. వీటిల్లో మంచివి, బెస్ట్ ప్రైస్ కి వచ్చే మూడు లాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బయోమెట్రిక్ ప్యాడ్‌లాక్‌:

ఈ డిజిటల్ లాక్ ని మన ఫింగర్ ప్రింట్ ద్వారా యాక్సెస్ చేసి మన డోర్ ని ఓపెన్ చేయొచ్చు. దీని వలన మన తాళం చెవి జాగ్రత్తగా పెట్టుకోవాలనే టెన్షన్ ఉండదు. ఆ మెషిన్ ని ఎవరైనా దొంగలు పగలగొట్టినా కూడా లాక్ ఓపెన్ అవ్వదు. ఇందులో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇంట్లో ఒకేసారి ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ని అటాచ్ చేసుకోవచ్చు. పైగా దీని రేటు మార్కెట్ లో దొరికే ఒక మంచి ఐరన్ లాక్ అంతే ఉంటుంది. మాములుగా దీని ఒరిజినల్ రేటు వచ్చి 3,999 కానీ అమెజాన్ లో ఇప్పుడు ఈ లాక్ మీద 53 శాతం డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ పోనూ 1,549 రూపాయలకే ఈ అడ్వాన్స్డ్  బయోమెట్రిక్ ప్యాడ్‌లాక్‌ ని మనం కొనుక్కోవచ్చు. దీనికి USB కేబుల్ ద్వారా ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. ఈ లాక్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

ఆర్కినిక్స్ రగ్గడ్ స్మార్ట్ ఫింగర్ ప్రింట్ ప్యాడ్‌లాక్:

ఈ ఫింగర్‌ప్రింట్ లాక్ లో ఒక స్పెషాలిటీ ఉంది. ఇందులో ఒకేసారి 10 మంది ఫింగర్ ప్రింట్స్ ని అటాచ్ చెయ్యొచ్చు. పెద్ద ఫ్యామిలీ ఉన్న వారికి ఇది సరైనా లాక్ సిస్టం అని చెప్పవచ్చు. కాకపోతే దీని రేటు కొంచెం ఎక్కువ. దీని అసలు ధర 6,999 రూపాయలు. కంగారు పడకండి, కానీ దీనికి కూడా అమెజాన్ లో 47 శాతం డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ పోనూ ఈ లాక్ రూ. 3,690కే వచ్చేస్తుంది. ఈ లాక్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

Escozor స్మార్ట్ హెవీడ్యూటీ ఫింగర్ ప్రింట్ లాక్:

పైన రెండు లాక్స్ తో పోలిస్తే దీనిలో ఒక కొత్త ఫీచర్ ఉంది. పైన చెప్పింది జస్ట్ ఒక లాక్ సిస్టం మాత్రమే. ఒకసారి సెటప్ చేసుకుని, ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జ్ పెడితే సరిపోతుంది, కాని ఈ లాక్ లో మనం ఫింగర్ ప్రింట్ తో పాటు మొబైల్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుని, దాని నుంచి కూడా మనం ఇంట్లో ఉన్నా, లేకున్నా మన ఇంటిని లాక్ అండ్ అన్ లాక్ చెయ్యొచ్చు. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు రేటు కూడా అలానే ఉంటుంది కదా. ఈ లాక్‌ప్యాడ్ ఒరిజినల్ రేటు 9,500 ఉంటుంది. కానీ మీరు అమెజాన్ లో ఉన్న ఆఫర్ ద్వారా జస్ట్ 6,990కే కొనుక్కోవచ్చు. ఈ లాక్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

నిజంగా వండర్ఫుల్ టెక్నాలజీ కదా, కాకపోతే ఈ టెక్నాలజీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పొరపాటున లాక్ డ్యామేజ్ అయితే ఎక్స్పర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చెయ్యాలి. ఈ లోపు ఎమర్జెన్సీ పని ఉంటే ఏకంగా తలుపునే పగలగొట్టాలి. మరి మీరు కూడా ఈ ఫింగర్ ప్రింట్ లాక్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారా? కామెంట్ చెయ్యండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి