iDreamPost
android-app
ios-app

20 వేల బడ్జెట్‌లో అదిరే ఫీచర్స్‌తో 5జీ స్మార్ట్ ఫోన్.. ఇంతకంటే మంచి డీల్ ఉండదేమో!

  • Published Jun 24, 2024 | 10:19 PM Updated Updated Jun 24, 2024 | 10:19 PM

Best Budget 5G Phone: 20 వేల బడ్జెట్ లో అదిరిపోయే ఫీచర్స్ తో మంచి 5జీ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మీకు మంచి అవకాశం. ఇంతకంటే మంచి డీల్ దొరకదేమో.

Best Budget 5G Phone: 20 వేల బడ్జెట్ లో అదిరిపోయే ఫీచర్స్ తో మంచి 5జీ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మీకు మంచి అవకాశం. ఇంతకంటే మంచి డీల్ దొరకదేమో.

  • Published Jun 24, 2024 | 10:19 PMUpdated Jun 24, 2024 | 10:19 PM
20 వేల బడ్జెట్‌లో అదిరే ఫీచర్స్‌తో 5జీ స్మార్ట్ ఫోన్.. ఇంతకంటే మంచి డీల్ ఉండదేమో!

తక్కువ బడ్జెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలి.. మంచి ఫీచర్స్ ఉండాలి అని కోరుకునేవారికి ఈ వన్ ప్లస్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 20 వేల లోపు బడ్జెట్ లో అద్భుతమైన ఫీచర్స్ తో ఈ ఫోన్ వస్తుంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. తాజాగా నార్డ్ సిరీస్ లో సీఈ 4 లైట్ 5జీ ఫోన్ ను లాంఛ్ చేసింది. గత ఏడాది నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్ తీసుకొచ్చింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు సీఈ 4 లైట్ ఫోన్ ను తీసుకొచ్చింది వన్ ప్లస్. ఇది 5500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది.  మొదటిది 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో రాగా.. మరొకటి 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. మొదటి వేరియంట్ ధర రూ. 19,999 కాగా.. రెండో వేరియంట్ ధర రూ. 22,999గా ఉంది. దీని ఫీచర్స్ విషయానికొస్తే.. 

వన్ ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ ఫీచర్స్:

  • డిస్ప్లే: ఇది 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేటుతో.. 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 
  • ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తుంది. 
  • కెమెరా: 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా (సోనీ ఎల్వైటీ-600 కెమెరా). ఇది ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. 
  • బ్యాటరీ: 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.   
  • ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఇచ్చారు. 
  • కలర్స్: అల్ట్రా ఆరెంజ్, మెగా బ్లూ, సూపర్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.  

మెగా బ్లూ, సూపర్ సిల్వర్ కలర్ ఫోన్లు జూన్ 27 నుంచి అమెజాన్, వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ లో అందుబాటులోకి వస్తుండగా.. అల్ట్రా ఆరెంజ్ ఫోన్ సేల్ తేదీని ఇంకా ప్రకటించలేదు. త్వరలో ప్రకటించనుంది.