iDreamPost

అట్లుంటది టిల్లుగాడితో.. ఫస్ట్‌ డే గుంటూరు కారం రికార్డ్స్‌ని బ్రేక్‌ చేసిన కలెక్షన్స్‌

  • Published Mar 30, 2024 | 11:05 AMUpdated Mar 30, 2024 | 11:47 AM

Tillu Square 1st Day Collection: డీజే టిల్లుకి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రం ఫస్ట్‌ డే కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఆ వివరాలు..

Tillu Square 1st Day Collection: డీజే టిల్లుకి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రం ఫస్ట్‌ డే కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఆ వివరాలు..

  • Published Mar 30, 2024 | 11:05 AMUpdated Mar 30, 2024 | 11:47 AM
అట్లుంటది టిల్లుగాడితో.. ఫస్ట్‌ డే గుంటూరు కారం రికార్డ్స్‌ని బ్రేక్‌ చేసిన కలెక్షన్స్‌

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా రూపొందిన టిల్లు స్క్వేర్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక 2022లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా వచ్చిందే టిల్లు స్క్వేర్ చిత్రం. సీక్వెల్‌ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. దాంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొనగా.. హిట్‌ తెచ్చుకుని.. వాటిని రీచ్‌ అయ్యింది టిల్లు స్క్వేర్.

ఇక ఫస్ట్‌ డే కలెక్షన్ల విషయంలో టిల్లు స్క్వేర్ సినిమా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గుంటూరు కారం సినిమా రికార్డ్స్‌ బ్రేక్‌ చేసింది. అయితే అది మన దగ్గర కాదు ఓవర్సీస్‌లో. యూఎస్‌లో టిల్లు స్క్వేర్ ఫస్ట్‌ డే 450కే డాలర్స్‌ కలెక్ట్‌ చేసి గుంటూరు కారం డే కలెక్షన్స్‌ రికార్డ్‌ని బ్రేక్‌ చేసింది. ఇక టోటర్‌ వరల్డ్‌ వైడ్‌గా చూసుకుంటే టిల్లు స్క్వేర్ ఫస్ట్‌ డే బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. డే 1 నాడు వరల్డ్‌ వైడ్‌గా 23.7 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది. రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని భావిస్తుండగా.. డే 1 కలెక్షన్స్‌తో అది పక్కా అని ప్రూవ్‌ అయ్యింది.

కాగా టిల్లు స్క్వేర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్స్‌లో విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 550 థియేటర్లలో టిల్లు స్వ్కేర్‌ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ. 27 కోట్ల వరకు ప్రీ మార్కెట్ జరిగింది. దాంతో రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. కాబట్టి టిల్లు స్క్వేర్ కమర్షియల్‌గా హిట్ కొట్టాలంటే రూ. 28 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే డే 1 నాడే ఏకంగా 23.5 కోట్ల రూపాయలు వసూలు చేయడంతో.. రెండో రోజు నాటికి బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని ఆశిస్తున్నారు. మొత్తానికి సిద్ధు ఖాతాలో మరో హిట్‌ పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి