iDreamPost

టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్! ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే..

  • Author ajaykrishna Updated - 04:28 PM, Sat - 21 October 23

మాస్ రాజా రవితేజ - దర్శకుడు వంశీ ఆకెళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని కార్తికేయ, కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించగా.. తాజాగా టైగర్ నాగేశ్వరరావు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మాస్ రాజా రవితేజ – దర్శకుడు వంశీ ఆకెళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని కార్తికేయ, కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించగా.. తాజాగా టైగర్ నాగేశ్వరరావు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. రవితేజ కెరీర్ లో పాన్ ఇండియా రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలకపాత్రలు పోషించారు. దాదాపు చాలా ఏళ్ళ తర్వాత రేణు దేశాయ్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఇదే.

ఇక పాన్ ఇండియా వైడ్ ట్రైలర్, ప్రమోషన్స్ తో మినిమమ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. విడుదలైన ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ సొంతం. చేసుకుంది. ఓ రకంగా కొన్ని ఏరియాల నుండి మిశ్రమ ఫలితాలు అందుకున్నా.. కలెక్షన్స్ పరంగా రవితేజ కెరీర్ లో బెస్ట్ ఇచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళ్తే.. నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌ లో రూ. 5.40 కోట్లు, ఏపీలోని మిగతా ఏరియాలన్నీ కలిపి రూ. 17 కోట్లు జరిగింది. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 4.00 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 3.00 కోట్ల వరకు.. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే టైగర్ రూ. రూ. 37.50 కోట్లు బిజినెస్ చేసిందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా.. మొదటి రోజు టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాలలో రూ. 5.5 కోట్ల షేర్, ఇండియా వైడ్ గా అన్ని భాషలు కలుపుకొని రూ. 8 కోట్ల నెట్ వసూల్ చేసిందని సమాచారం. ఈ లెక్కన రవితేజ కెరీర్ లో ఇది బెస్ట్ ఓపెనింగ్స్ అనుకున్నా.. టైగర్ ముందు ఇంకా బిగ్ టార్గెట్ ఉంది. ఎందుకంటే.. రూ. 37.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఫస్ట్ డే రూ. 8 కోట్ల నెట్ వసూల్ చేసింది. సో.. ఇంకా దాదాపు రూ. 29.5 కోట్లు వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరొందిన టైగర్ నాగేశ్వరరావు లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించారు. మరి టైగర్ నాగేశ్వరరావు మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి