iDreamPost

రజాకార్ నిర్మాతకు బెదిరింపు కాల్స్..! భద్రత కల్పించిన కేంద్ర హోంశాఖ!

తెలంగాణలో నిజాం హయంలో జరిగిన దారుణ ఘటనల ఆధారంగా నిర్మించిన ‘రజాకార్’ మూవీ ఇటీవల రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది.

తెలంగాణలో నిజాం హయంలో జరిగిన దారుణ ఘటనల ఆధారంగా నిర్మించిన ‘రజాకార్’ మూవీ ఇటీవల రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది.

రజాకార్ నిర్మాతకు బెదిరింపు కాల్స్..! భద్రత కల్పించిన కేంద్ర హోంశాఖ!

నిజాం కాలంలో తెలంగాణలో జరిగిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రైవేట్ ఆర్మీనే రజకార్లు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ బూచీగా చూపిస్తూ.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తుర్కిస్థాన్ పాలన చేశాడు. రజాకార్లకు సయ్యద్ ఖాసీమ్ రజ్వి నాయకత్వం వహించారు. నిజాం రాజుకు సైనికాధికారి అయిన ఖాసీం రజ్వీ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో దురాగతాలు, హిందూ మహిళలపై అరాచకాలు కొనసాగించడంతో పాటు భారత ప్రభుత్వాన్నే ఎదిరించాడు. దీంతో అప్పటి హూం మంత్రి వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ స్టేట్ పై సైనిక చర్యలు తీసుకొని తెలంగాణ ప్రజలకు నిజాం పాల నుంచి విముక్తి కల్పిస్తారు. ఈ చరిత్రను కళ్లకు కట్టినట్లు ‘రజాకార్’ మూవీలో చూపించారు. తాజాగా ఈ చిత్రం నిర్మాతకు బెదిరింపు కాల్స్ రావడతంతో కేంద్ర హూంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

భారత దేశానికి ఆగస్టు 15, 1947 న స్వాతంత్రం వచ్చింది.  అప్పటి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ మాత్రం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధీనంలోనే ఉంది. కేంద్రాన్ని దిక్కరించి భారత దేశంలో ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. నిజాం సైనికాధికారి ఖాసీం రజ్వీకి అన్ని బాధ్యతలు అప్పగించాడు. కృరమైన స్వభావం కలిగిన ఖాసీం రజ్వీ తెలంగాణలో ఎన్నో అరాచకాలు, అకృత్యాలకు పాల్పపడి అందినంత దోచుకున్నాడు. మొత్తానికి అప్పటి హూం మంత్రి వల్లభాయ్ పటేల్ నిర్ణయం వల్ల హైదరాబాద్ విలీనం చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాకిస్థాన్ పారిపోయాడు. నిజాం పాలన సమయంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కన్నీటి కష్టాలు ‘రజాకార్’ మూవీలో కళ్లకు కట్టినట్టు చూపించారు.

Threat calls to razakar producer

‘రజాకార్’ మూవీ రిలీజ్ కి ముందే ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చిత్రం రిలీజ్ చేయాలని చూసినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. రిలీజ్ అయిన అన్ని ధియేటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు రాబడుతుంది. తాజాగా ఈ చిత్ర నిర్మాతకు అనూహ్య పరిణామం ఎదురైంది. నిర్మాత గూడూరు నారనాయణ రెడ్డికి దాదాపు 1100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు కేంద్ర హూం శాఖకకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే ఆయనకు 1+1 సీఆర్‌పీఎఫ్ జవాన్ లను భద్రత నిమిత్తం కేటాయించింది. రజాకార్ చిత్రానికి యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ప్రముఖ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి