iDreamPost

This Week Must Watch Movies In OTT: ఈ వారం OTT లో ఈ 4 సినిమాలతో ఎంటర్టైన్మెంట్ పక్కా…

  • Published Jun 25, 2024 | 11:50 AMUpdated Jun 25, 2024 | 6:30 PM

This Week Must Watch Movies In OTT: ప్రతి వారం లానే ఈ వారం కూడా ఇరవై కు పైగా సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి స్ట్రీమింగ్ కానున్న చిత్రాలలో చూడదగిన చిత్రాలు ఏంటి.. అవి ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

This Week Must Watch Movies In OTT: ప్రతి వారం లానే ఈ వారం కూడా ఇరవై కు పైగా సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి స్ట్రీమింగ్ కానున్న చిత్రాలలో చూడదగిన చిత్రాలు ఏంటి.. అవి ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

  • Published Jun 25, 2024 | 11:50 AMUpdated Jun 25, 2024 | 6:30 PM
This Week Must Watch Movies In OTT: ఈ వారం OTT లో ఈ 4 సినిమాలతో ఎంటర్టైన్మెంట్ పక్కా…

ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీ లో ఇరవైకు పైగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. దాదాపు ప్రేక్షకులంతా అన్ని సినిమాలను చూడడం లేదు. వచ్చే వాటిలో బెస్ట్ మూవీస్ ఏంటి అనే వాటిపైనే వారు ఫోకస్ చేస్తున్నారు. ప్రతి వారం ఇలానే జరుగుతూ వస్తుంది. వారాంతరంలో ఏ ఏ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయనే లిస్ట్ రావడం, వాటిలో చూడదగిన సినిమాలు, సిరీస్ లు ఏంటా అని ప్రేక్షకులు.. సెర్చ్ చేయడం. గత వారం అయితే ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కు ఎక్కడా డోకా లేకుండా మంచి మంచి కంటెంట్ తో ఉన్న సినిమాలు, సిరీస్ లు చాలానే వచ్చాయి. మరి ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలు , సిరీస్ లలో చూడదగిన సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయనే లిస్ట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. వాటిలో రెండు తెలుగు సినిమాలు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు.. మరో రెండు కామెడీ సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీ అయిపోతున్నాయి, మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

లవ్ మౌళి :

చాలా గ్యాప్ తర్వాత నవదీప్ మెయిన్ లీడ్ లో నటించిన సినిమా లవ్ మౌళి. ఈ మధ్య చాలా మంది వాచ్ ఎలోన్ మూవీస్ ను చూడడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమా కూడా అలాంటిదే. సినిమా కాన్సెప్ట్ యూత్ కి నచ్చినా కానీ కొన్ని సీన్స్ థియేటర్స్ లో అందరితో కలిసి చూడాలంటే కాస్త ఇబ్బంది పడుతుంటారు. అందుకోసం ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఈ సినిమా జూన్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ కాకుండా చూసేయండి.

Love Mouli

భజే వాయు వేగం:

దాదాపు ఈ సినిమాతో పాటు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. వాటితో పోల్చుకుంటూ ఈ సినిమా కాస్త ఆలస్యం అయినట్లే. కార్తికేయ నటించిన ఈ సినిమా మే 31 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. హిట్ టాక్ నే సంపాదించుకుంది. దీనితో థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూన్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

bhaje vaayu vegam

శర్మాజీ కీ బేటీ:

ఈ మధ్య కాలంలో హర్రర్ , థ్రిల్లర్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలని చెప్పి.. ప్రేక్షకులకు టెన్షన్ తెప్పించే సినిమాలు, సిరీస్ లే ఎక్కువగా వస్తున్నాయి. కాసేపు ఆ టెన్షన్స్ అన్ని మర్చిపోయి.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి.. ఈ హిందీ సినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సినిమాను కూడా యాడ్ చేసేసుకోండి. శర్మాజీ కీ భేటీ మూవీ జూన్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Sharmaji ka beti

గురువాయూర్ అంబలనాడయిల్:

సలార్, గోట్ లైఫ్ ఆడు జీవితం సినిమాలతో పృథ్విరాజ్ సుకుమారాన్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమాల తర్వాత ఈ హీరో నటించిన మరో సినిమానే గురువాయూర్ అంబలనాడయిల్. ఇక ఈ సినిమా కూడా ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్ ప్లాట్ లో రాబోతుంది. కాబట్టి ఎంచక్కా ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఓ మంచి సినిమా చూడాలంటే మాత్రం ఈ సినిమా చూసేయండి. ఈ సినిమా జూన్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

guruvayr

ఇక ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం.. ఓటీటీ లో ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలలో ఈ సినిమాలు బెస్ట్ అని చెప్పి తీరాలి. వీకెండ్ లోపు ఇంకా ఏమైనా సినిమాలు కూడా ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి