iDreamPost
android-app
ios-app

మహీంద్రాలో ఈ SUV ఎంతో స్పెషల్.. అస్సలు మిస్ అవ్వద్దు!

Best Budget SUV From Mahindra: చాలా మంది ఎస్యూవీ కొనాలి అనుకుంటారు. కానీ, మంచి ధరలో బెస్ట్ ఎస్యూవీ కారు గురించి తెలియక పోవచ్చు. వారికోసం బెస్ట్ ఎస్యూవీ తీసుకొచ్చాం.

Best Budget SUV From Mahindra: చాలా మంది ఎస్యూవీ కొనాలి అనుకుంటారు. కానీ, మంచి ధరలో బెస్ట్ ఎస్యూవీ కారు గురించి తెలియక పోవచ్చు. వారికోసం బెస్ట్ ఎస్యూవీ తీసుకొచ్చాం.

మహీంద్రాలో ఈ SUV ఎంతో స్పెషల్.. అస్సలు మిస్ అవ్వద్దు!

చాలామంది హ్యాచ్ బ్యాక్, సెడాన్ కార్లను ఇష్టపడుతూ ఉంటారు. కానీ, ఎస్యూవీ కార్లను ఇష్టపడే వాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. కారులో స్పేస్ ఎక్కువ ఉండాలని భావించే వాళ్లంతా ఈ ఎస్యూవీ సెగ్మెంట్ ని ఎంచుకుంటారు. అయితే ఎస్యూవీ కారు అంటే కాస్త ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఫీచర్స్ కూడా లభిస్తాయి. మీరు గను ఎస్యూవీ కారును కొనుగోలు చేయాలి అనుకుంటుంటే మాత్రం ఈ మహీంద్రా కారుని ఒకసారి మీ లిస్టులోకి యాడ్ చేసుకోండి. ఎందుకంటే లుక్స్, ఫీచర్స్, ఇంటీరియర్ అన్నింటిలో కూడా ఇది ఒక ప్రీమియం కారు. అలాగే సేఫ్టీ ఫీచర్స్ లో కూడా ఏ బడా కంపెనీ కార్లకు తీసిపోదు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మహీంద్రా కంపెనీకి చెందిన బెస్ట్ ఎస్యూవీ.. XUV300 గురించి. ఈ కారు మహీంద్రా ఎస్యూవీ సెగ్మెంట్ లో బెస్ట్ కారనే చెప్పాలి. పైగా ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. ఈ కారులో మొత్తం 25 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఆన్ రోడ్ ధర దీనికి ఇంకో రూ.60 నుంచి రూ.70 వేల వరకు అదనంగా ఉంటుంది. ఇందులో టాప్ మోడల్ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ.14.76 లక్షలుగా ఉంది. ఇందులో పెట్రోలు, డీజిల్ రెండు ఫ్యూయల్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి.

ఇంక ఇంజిన్ విషయానికి వస్తే.. 1197సీసీ నుంచి 1497సీసీ వరకు వేరియంట్ ని బట్టి మారుతూ ఉంటుంది. ఇందులో 3 ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, టీజీడీఐ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇంక మైలేజ్ విషయానికి వస్తే.. ఈ కారు లీటరుకు 20 కిలీమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. ఈ కారు ఫీచర్స్ చూస్తే.. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వస్తుంది. సింగిల్ పేన్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇందులో మీకు డ్యూయల్ జోన్ ఏసీ కూడా ఉంటుంది. రెండు వేర్వేరు టెంపరేచర్స్ ని ఒకేసారి కారులో పెట్టుకోవచ్చు. కనెక్టెడ్ కార్ టెక్, రెయిన్ సెన్సింగ్ సెన్సార్స్ ఇందులో ఉన్నాయి.

ఈ కారు సేఫ్టీ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ మోడల్ టాప్ ఎండ్ లో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇందులో డ్రైవర్ నీ సేఫ్టీ కోసం కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఏబీఎస్, రేర్ డిస్క్ బ్రేక్స్, సెంట్రల్ లాకింగ్, యాంటీ థెఫ్ట్ అలారమ్, ఈబీసీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, పానిక్ బ్రేకింగ్ సిగ్నల్, రేర్ కెమెరా, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హిల్ అసిస్టిట్ వంటి ఎన్నీ సేఫ్టీ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఎక్స్ యూవీ 300 మోడల్ కి గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ దక్కింది. అంటే మీ కుటుంబానికి ఇది సేఫెస్ట్ ఎస్యూవీ అనమాట. మరి.. ఈ XUV 300 మీరు గనుక వాడుతుంటే మీ ఎక్స్ పీరియన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి