రోజుకి 15 గంటలు PUBG ఆడిన కుర్రాడు.. ఆఖరికి..!

రోజుకి 15 గంటలు PUBG ఆడిన కుర్రాడు.. ఆఖరికి..!

రోజుకి 15 గంటలు PUBG ఆడిన కుర్రాడు.. ఆఖరికి..!

వీడియో గేమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా వాటికి పెద్ద మార్కెట్, డిమాండ్ కూడా ఉంది. అందుకే అన్నీ కంపెనీలు పోటా పోటీగా గేమర్స్ ను ఆకట్టుకునేందుకు రకరకాల యాక్షన్ గేమ్స్ ని తీసుకొస్తుంటాయి. అలా వచ్చిన గేమ్స్ లో ప్లేయర్స్ అన్నౌన్ బ్యాటిల్ గ్రౌండ్స్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ ఒక కారు చిచ్చులా వ్యాపించింది. వయసుతో సంబంధం లేకుండా ఈ గేమ్ నే ఆడటం మొదలు పెట్టారు. ఎంతో రియలిస్టిక్, రకరకాల వెపన్స్, వర్చువల్ వరల్డ్ లో ఆడే గేమ్ కావడంతో అంతా దీనికి అడిక్ట్ అయిపోయారు. లాంఛ్ అయిన కొన్ని నెలల్లోనే కోట్ల సంఖ్యలో గేమర్స్ ఈ ఆటను ఇన్ స్టాల్ చేసుకున్నారు.

ఇందులో డబ్బులతో పెర్క్స్, యూసీలు కొనడం మొదలు పెట్టారు. చాలా మంది పిల్లలు అయితే తల్లిదండ్రులకు తెలియకుండా వారి కార్డ్స్ ను యాడ్ చేసి లక్షలు ఖర్చు చేశారు. అలాంటి ఈ పబ్ జీ గేమ్ పై ఎంతో వ్యతిరేకత వచ్చింది. పైగా వ్యక్తిగత సమాచార భద్రత లేదనే కారణంతో కేంద్రం ఈ ఆటను ఇండియాలో బ్యాన్ చేసింది. అయినా వీపీఎన్ యాప్స్ వాడి పబ్ జీ ఆడుతూ ఉన్న వాళ్లు లేకపోలేదు. ఇప్పుడు మళ్లీ బీజీఎంఐ పేరిట మళ్లీ ఈ గేమ్ ని లాంఛ్ చేశారు. ఇప్పుడు కొన్ని సేఫ్టీ మెజర్స్ పాటించామని.. ఆటకు బానిసలు కాకుండా టైమ్ బ్రేక్ రూల్ తీసుకొచ్చామని బీజీఎంఐ చెబుతోంది. కానీ, తాచాగా వెలుగు చూసిన ఒక కేసు అవేమీ పని చేయవనే అనుమానం కలిగేలా చేస్తోంది.

రాజస్థాన్ కు చెందిన ఒక 15 ఏళ్ల కుర్రాడికి పక్కింటి వ్యక్తి మొబైల్ ఫోన్ ఇచ్చాడు. అతను ఏదైనా కొత్త విషయాలు నేర్చుకుంటాడని.. చదువుకుంటాడని ఆ పని చేశాడు. కానీ, ఆ కుర్రాడు మాత్రం పబ్ జీ ఆడటం మొదలు పెట్టాడు. అది ప్రమాదకరమైన ఆట అని తెలుసుకుని ఆ ఫోన్ లాగేసుకున్నారు. కానీ, వారిని ఒప్పించి మళ్లీ ఆ ఫోన్ తీసుకున్నాడు. ఎవరికీ తెలియకుండా దుప్పట్లో దూరి ఆటను ఆడటం మొదలు పెట్టాడు. అతని కళ్లు కూడా దారుణంగా మారిపోయాయి.

గత ఆరు నెలలుగా అదే పనిగా రోజుకు 15 గంటలు పబ్ జీ ఆడుతున్నాడు. అతనికి అల్వార్, జైపూర్ లో చికిత్స చేయించిన తర్వాత కళ్లు బాగుపడ్డాయి. కానీ, తర్వాత అతని మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినింది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. నిద్రలో ఫైర్ ఫైర్ అని కేకలు వేయడం చేయసాగాడు. భయంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ఎన్ని విధాలుగా చికిత్స అందించినా కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. అతడిని అల్వార్ లోని రిహ్యాబిటేషన్ సెంటర్ లో చేర్పించారు. అక్కడ అతనికి కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ ఆటలో నిపుణులు కనుగొన్న విషయం ఏంటంటే.. అందులో ఉండే వంద మంది ప్లేయర్స్ లో ఎవరూ ఓటమిని ఒప్పుకోరు.. ప్రతి ఒక్కరు గెలవాలి అని చూస్తారు.

ఫైనల్ జోన్ కు చేరుకున్న సమయంలో అయితే వారి మానసిక స్థితి మరీ గందరగోళంగా ఉంటుంది. ఎలా గెలవాలి, ప్రత్యర్థులను ఎలా ఓడించాలి అనే ఆలోచనలతో మెదడుపై ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా ఆటలో ఓడిపోయినందుకు ప్రాణాలు తీసున్నవాళ్లు.. పబ్ జీ ఆడనివ్వడం లేదంటూ ప్రాణాలు తీసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఏదైనా లిమిట్స్ లో ఉంటే అది అలవాటు.. కానీ, పరిధి దాటితే అది వ్యసనం అవుతుంది. అలవాటుగా ఉన్నంతసేపు ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, వ్యసనంగా మారితే మాత్రం అందులోంచి బయటపడటం కష్టం అవుతుంది.

Show comments