iDreamPost
android-app
ios-app

Scam: యూట్యూబ్ చూసి నేర్చుకొని ఏకంగా రూ. 42 లక్షలు కొట్టేసిన 19 ఏళ్ల కుర్రాడు!

  • Published Nov 14, 2024 | 2:47 PM Updated Updated Nov 14, 2024 | 2:47 PM

Scam: యూట్యూబ్ చూసి 42 లక్షల స్కామ్ చేశాడు ఓ కుర్రాడు. ఈ ఘటన వైరల్ అవుతుంది. దాని గురించి తెలిస్తే వామ్మో ఇదేమి మోసం రా మైండ్ బ్లాక్ అయ్యింది అనకుండా ఉండలేరు. యూట్యూబ్ చూసి నేర్చుకొని మరీ 42 లక్షలు కొల్లగొట్టాడు ఓ కుర్రాడు.

Scam: యూట్యూబ్ చూసి 42 లక్షల స్కామ్ చేశాడు ఓ కుర్రాడు. ఈ ఘటన వైరల్ అవుతుంది. దాని గురించి తెలిస్తే వామ్మో ఇదేమి మోసం రా మైండ్ బ్లాక్ అయ్యింది అనకుండా ఉండలేరు. యూట్యూబ్ చూసి నేర్చుకొని మరీ 42 లక్షలు కొల్లగొట్టాడు ఓ కుర్రాడు.

Scam: యూట్యూబ్ చూసి నేర్చుకొని ఏకంగా రూ. 42 లక్షలు కొట్టేసిన 19 ఏళ్ల కుర్రాడు!

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టెక్నాలజీతో పాటే సైబర్ మోసాల సంఖ్య కూడా చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది. చాలా దారుణంగా మోసాల సంఖ్య పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా అమాయకులను టార్గెట్‌గా చేసుకుంటూ రెచ్చిపోతున్నారు ఖతర్నాక్ కేటుగాళ్లు. ఎన్నో వేల మందిని మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. బయట మోసాలు సంగతి ఏమో కానీ ఆన్‌లైన్ మోసాలు మాత్రం బాగా పెరిగిపోయాయి. ఈ మోసాలు ఈమధ్య చాలా సర్వసాధారణంగా మారాయి. ఇదే తరహాలో ఇంకో మోసం వెలుగులోకి వచ్చింది. దాని గురించి తెలిస్తే వామ్మో ఇదేమి మోసం రా మైండ్ బ్లాక్ అయ్యింది అనకుండా ఉండలేరు. యూట్యూబ్ చూసి నేర్చుకొని మరీ 42 లక్షలు కొల్లగొట్టాడు ఓ కుర్రాడు. ఇంతకీ ఆ మోసం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి ఫేక్‌ డిపాజిట్‌ స్కీమ్ క్రియేట్ చేశాడు. ఆ స్కీమ్ పేరుతో ఒకరిని కాదు ఇద్దరినీ కాదు దాదాపు 200 మందిని మోసం చేశాడు. యూట్యూబ్‌ ద్వారా మోసం చేయటం ఎలాగో నేర్చుకున్నాడు.ఇతని పేరు కాసిఫ్ మిశ్రా. ఇతని వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఆన్‌లైన్‌లో ఫేక్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ కింద ఈ కేటుగాడు సుమారు రూ.42 లక్షలు కాజేశాడని తెలిసింది.ఇతనికి ఇన్‌స్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాసీఫ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇన్వెస్టర్లను ఎరగా మార్చుకున్నాడు. స్టార్టింగ్ లో తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టిన వారికి ఎక్కువ డబ్బు ఇచ్చాడు. అలా ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చేలా బాగానే ప్లాన్‌ చేశాడు. డబ్బులు ఆశ చూపించి బాగా నమ్మించాడు.

ఒకసారి తన స్కీమ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేసిన వారికి తమ స్నేహితులు, పరిచయస్తులకు చెప్పమని కూడా ఒప్పించాడు. అప్పుడు రూ. 99,999 ఇన్వెస్ట్ చేస్తే 13 నెలల్లో ఏకంగా రూ.13,99,999లు వస్తాయని నమ్మించాడు. అతని మాటలు నమ్మి దాదాపు 200 మంది మాయలో పడ్డారు. దారుణంగా మోస పోయారు. అయితే ఎలాగోలా కాసిఫ్‌ కంత్రీ ప్లాన్‌ వెలుగులోకి వచ్చింది. ఇతడి మాయలో పడి మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ కిలాడి బాలుడి ఇంటిపై దాడి చేసి క్యాష్ కౌంట్ మెషీన్, కారు, ల్యాప్‌టాప్, మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేటుగాడిని రెండు రోజుల పాటు రిమాండ్ హోంకు తరలించినట్టుగా తెలిసింది. ఇదీ సంగతి తప్పుడు మార్గంలో త్వరగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెట్టడానికి రెఢీ అయ్యాడు. ఇక ఇతని ఘరానా మోసం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.