కుమారీ ఆంటీపై కేసు నమోదు! ఫుడ్ స్టాల్ సంగతేంటి?

Case On Kumari Aunty: స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారీ ఆంటీ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ, ఆ పాపులారిటీ ఇప్పుడు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది.

Case On Kumari Aunty: స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారీ ఆంటీ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ, ఆ పాపులారిటీ ఇప్పుడు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది.

ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవిడ పేరే తెగ రీసౌండింగ్ ఇస్తోంది. కేబుల్ బ్రిడ్జి, దుర్గం చెరువులాగానే ఈవిడ పేరు కూడా అక్కడ ఒక లాండ్ మార్క్ అయిపోయింది. మీమర్స్, యూట్యూబర్స్, సెలబ్రిటీల పుణ్యమా అని ఆవిడ బిజినెస్ రెండింతలు అయ్యింది. అయితే ఆ పుణ్యం ఎక్కువ రోజులు నిలబడలేదు. అదే చివరికి శాపంగా మారి.. చివరకి ఆమె ఫుడ్ స్టాల్ కూడా పెట్టుకునే పరిస్థితి లేకుండా చేసింది. అక్కడితో ఆగినా బాగుండేదేమో.. ఇప్పుడు ఆ పబ్లిసిటీ కాస్తా కుమారీ ఆంటీ మీద కేసు కూడా పెట్టే పరిస్థితికి తీసుకెళ్లింది. తనకు పబ్లిసిటీ వచ్చినందుకు ఆనందంగానే ఉన్నా ఇలాంటిది జరుగుతుందని ఆవిడ ముందే గ్రహించింది. చివరకు ఆమె అనుకున్నదే అయ్యింది.

కుమారీ ఆంటీ పేరు ఇప్పుడు హైదరాబాద్ ఫుడ్ బిజినెస్ లో తెగ వైరల్ అవుతోంది. ఈవిడ గురించి తెలియని ఫుడ్ లవర్ ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఆవిడ గతంలోనూ ఫేమస్సే. కాకపోతే అప్పుడు ఫుడ్ వ్లాగ్స్ చేసేవాళ్లు, ఆ ప్రాంతంలో ఉండే కార్మికులు, అప్పుడప్పుడు కొత్తగా ఫుడ్ ట్రై చేయాలి అనుకునేవాళ్లు వెళ్లి తినేవాళ్లు. కానీ, ఎప్పుడైతే మీమర్స్ ఆవిడను వైరల్ చేశారో.. ఆవిడ దగ్గర ఫుడ్ తినాలి అంటూ ఎక్కడెక్కడి నుంచో రావడం స్టార్ట్ చేశారు. రోజుకు 300 ప్లేట్లు బిజినెస్ చేసే కుమారీ ఆంటీ.. ఏకంగా 500 ప్లేట్లు అమ్మడం మొదలు పెట్టింది. ఇంకేముంది.. క్రేజ్ ఎలాగైతే పెరిగిందో బిజినెస్ కూడా అలాగే పెరిగింది.

ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. సందీప్ కిషన్- వర్షా బొల్లమ్మ కూడా కుమారీ ఆంటీ చేతివంటి రుచి చూశారు. దాంతో ఆవిడ ఫుడ్ కు గిరాకీ బాగా పెరిగింది. అయితే ఎప్పుడైతే గిరాకీ పెరిగిందో.. ఆ రోడ్డులో వాహనాల తాకిడి కూడా పెరిగింది. వాటితో పాటుగా కుమారీ ఆంటీకి కొత్త కష్టాలు కూడా మొదలయ్యాయి. తాజాగా ఆవిడ ఫుడ్ ట్రక్కును పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదని.. వారి ఫుడ్ స్టాల్ వల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అవుతోందని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా వారి ట్రక్కును కూడా సీజ్ చేశారు. కాసేపు అక్కడ కుమారీ ఆంటీ కుటుంబానికి, పోలీసులకు వాగ్వాదం కూడా జరిగింది. పోలీసులు తనపై చేయి చేసుకున్నారంటూ కుమారీ ఆంటీ కొడుకు కూడా ఆరోపణలు చేశాడు.

ఎట్టకేలకు వారి ఫుడ్ ట్రక్కును అయితే తెచ్చి ఇచ్చారు. వెంటనే అన్ లోడ్ చేసుకోవాలని, ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పారు. కానీ, పోలీసులతో వాగ్వాదానికి దిగినందుకు మాత్రం కుమారీ ఆంటీ మీద కేసు అయితే నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే ఆ ప్లేస్ లో ఫుడ్ స్టాల్ పెట్టేందుకు అనుమతుల విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అసలు అక్కడ ఆవిడ ఫుడ్ స్టాల్ కొనసాగుతుందని కూడా చెప్పే పరిస్థితి లేదు. ఈ సోషల్ మీడియా క్రేజ్ కుమారీ ఆంటీని ఇంకెంత ఇబ్బంది పెడుతుందో అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆవిడ వ్యాపారం ఆవిడ చేసుకుంటుంటే.. ఇంటర్వ్యూల పేరుతో ఇంత బద్నాం చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి.. కుమారీ ఆంటీపై కేసు నమోదైందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments