iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ వాసులకు కొత్త రూల్.. ఆ విషయంలో పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్!

  • Published Oct 28, 2024 | 5:43 PM Updated Updated Oct 28, 2024 | 5:43 PM

Diwali Festival: దేశమంతా దీపావళి పండుగ ఎంతో సంతోషంగ జరుపుకుంటారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా కాల్చే క్రాకర్స్ నుంచి వెలువడుతున్న పొగ వల్ల వాతావరణం కాలుష్యం అవుతుంది. ఇది దృష్టింలో ఉంచుకొని గ్రేటర్ హైదరాబాద్ లో పోలీసులు కొత్త రూల్స్ తీసుకువచ్చారు. అవేంటో చూద్దాం..

Diwali Festival: దేశమంతా దీపావళి పండుగ ఎంతో సంతోషంగ జరుపుకుంటారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా కాల్చే క్రాకర్స్ నుంచి వెలువడుతున్న పొగ వల్ల వాతావరణం కాలుష్యం అవుతుంది. ఇది దృష్టింలో ఉంచుకొని గ్రేటర్ హైదరాబాద్ లో పోలీసులు కొత్త రూల్స్ తీసుకువచ్చారు. అవేంటో చూద్దాం..

హైదరాబాద్ వాసులకు కొత్త రూల్..  ఆ విషయంలో పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్!

దీపావళి పండుగ హిందువులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ. ఇంట్లో దీపాలు వెలిగించి, స్వీట్లు పంచుకుంటూ చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ టపాసులు కాలుస్తూ దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ టపాసులు పేల్చడం వల్ల కలిగే వాయు, శబ్ధ కాలుష్యం గురించి పెద్దగా పట్టించుకోరారు.అయితే దీపావళి పండుగ సందర్భంగా కాల్చే క్రాకర్స్ వల్ల విపరీతమైన పొల్యూషన్ ఏర్పడుతుంది. వాతావరణంలో వేడి, కార్బన్ డయాక్సైడ్, అనేక విష వాయువులు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. హైదరాబాద్ వాసులకు దీపావళి పండుగ వేళ పటాసులు పేల్చడంపై ఆంక్షలు విధించారు పోలీసులు. పటాసులు కాల్చడం వల్ల వస్తున్న విషపు వాయువల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు పలు నిబంధనలు విధించారు. వీటిని బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే..

దీపావళి పండుగ సందర్భంగా పోలీసులు కొత్త రూల్ తీసుకువచ్చారు. దీపావళి పండుగ రోజు కేవలం రెండు గంటల అంటే 8 నుంచి 10 గంల వరకే క్రాకర్స్ పేల్చాలని కొత్త రూల్ పెట్టారు. అది కూడా పరిమితికి లోబడి శబ్దాలు వచ్చే పటాసులు మత్రమే కాల్చాలని తెలిపారు. దీపావళి అనగానే అందరికీ గుర్తుకు వచ్చే క్రాకర్స్ చిచ్చుబుడ్లు, భూ చక్రాలు, థౌసెండ్ వాలా, లక్ష్మీ బాంబు, షార్ట్స్, సుతిల్ బాంబ్, రాకెట్స్, పాము బిల్లలు. తమ స్థాయికి తగ్గట్లు క్రాకర్స్ కొనుగోలు చేసి రాత్రంతా మారుమోగిస్తుంటారు. దీపావళి రోజు భూమిపై పేలే బాంబులే కాదు.. ఆకాశంలోకి దూసుకువెళ్లే మెరుపులు తెప్పించే పటాసులు పెద్ద ఎత్తున కాల్చుతున్నారు. ఎంత ఎక్కువ క్రాకర్స్ కాల్చితే అంత గొప్పగా ఫీల్ అవుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. పండుగ రోజే కాదు మాత్రమే కాదు.. పండుగ వస్తుందంటేనే కొంతమంది క్రాకర్స్ కాల్చడం మొదలు పెడతారు. అలా మళ్లీ కార్తీక పౌర్ణమి వచ్చే వారకు పటాకుల మోత మోగాల్సిందే. ఆ కొన్నిరోజులు ఆనందంగా ఉన్నా.. దాని పరిణామాలు వాతావరణంపై పడుతుంది. దీని వల్ల తెలియకుండానే విషవాయువు పీల్చి ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇటీవల కేవలం దీపావళి పండుగ రోజు మాత్రమే కాదు.. ప్రతి ఈవెంట్స్ కి క్రాకర్స్ కాల్చుతూ వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీపావళి పండుగ రోజు కేవలం రెండు గంటలు మాత్రమే కాల్చాలని తెలిపారు.నగర వాసులంతా ఈ నిబంధనలు పాటించి తమకు సహకరించాలని కోరారు. ఆ రోజు ప్రత్యేక బృందాలు పెట్రోలింగ్ జరుపుతారని.. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. క్రాకర్స్ అమ్మె షాపు యజమానులు తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలని అన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా క్రాకర్స్ అమ్మొద్దని హెచ్చరించారు. పురాణాల్లో దీపావళి పండుగ గురించి ఎన్నో రకాల కథలు చెబుతుంటారు. శ్రీకృష్ణుడి చేతిలో వధించబడిన నరకాసురుడు చనిపోయే ముందు స్వామి వారిని ఓ కోరిక కోరుతాడు. నాలాంటి రాక్షసుడు మరణించిన తర్వాత ప్రజలు ఈ రోజును సంతోషంగా జరుపుకోవాలని కోరాడు.. శ్రీకృష్ణుడు అలాగే అని వరమిస్తాడు. నరకాసుర వధ రోజునే దీపావళి జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ అని చెబుతారు. ప్రతి ఇంటా నూతన వెలుగు తీసుకువచ్చే గొప్ప పండుగ దీపావళి.