iDreamPost
android-app
ios-app

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తూ.. గలీజు పనులు.. పోలీసుల ఎంట్రీతో..

జల్సాలకు అలవాటు పడిన కొందరు సాప్ట్ వేర్ ఉద్యోగులు అడ్డదార్లు తొక్కారు. ఏకంగా గంజాయి విక్రయాలకు తెగబడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న వీరి దందాకు పోలీసుల ఎంట్రీతో ఊహించని షాక్ తగిలింది.

జల్సాలకు అలవాటు పడిన కొందరు సాప్ట్ వేర్ ఉద్యోగులు అడ్డదార్లు తొక్కారు. ఏకంగా గంజాయి విక్రయాలకు తెగబడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న వీరి దందాకు పోలీసుల ఎంట్రీతో ఊహించని షాక్ తగిలింది.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తూ.. గలీజు పనులు.. పోలీసుల ఎంట్రీతో..

సాఫ్ట్ వేర్ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు, వీకెండ్ హాలిడేస్, ఫారిన్ ట్రిప్స్ ఇలాంటి సౌకర్యాలు యువతను ఆకర్షిస్తుంటాయి. ఐటీ సెక్టార్ లో జాబ్ కొట్టాలని కలలుకంటుంటారు. ఐటీ జాబ్ లక్ష్యంగా గట్టిగా ప్రయత్నిస్తుంటారు. సాఫ్ట్ వేర్ జాబ్ సాధించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తుంటారు. ఇదే విధంగా ఓ నలుగురు యువకులు కష్టపడి చదువుకున్నారు. ఆ తర్వాత మంచి కంపెనీల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సాధించారు. కొంతకాలం తర్వాత వారు జల్సాలకు అలవాటుపడ్డారు. ఇంకేముంది సాఫ్ట్ వేర్లు కాస్త గలీజు పనులకు తెరలేపారు. డబ్బు సంపాదించేందుకు గంజాయి దందా చేపట్టారు. గుట్టుగా సాగుతున్న వీరి దందాకు పోలీసుల ఎంట్రీతో చెక్ పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో చోటుచేసుకుంది.

నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సరఫరా చేస్తున్నారు కొందరు వ్యక్తులు. గంజాయి మత్తులో దారుణాలకు ఒడిగడుతున్నారు. గంజాయి సేవిస్తూ దానికి బానిసలుగా మారి లైఫ్ ఆగం చేసుకుంటున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో మాదకద్రవ్యాల సరఫరా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలో మరోసారి నగరంలో గంజాయి గుప్పుమన్నది. గంజాయి అమ్ముతున్న నలుగు సాఫ్ట్​వేర్ ​ఉద్యోగులను బాలానగర్​ ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజేశ్‌ (24), రమేశ్‌ కృష్ణ (27), నక్కా నాగవంశీ (23), పల్నాడు జిల్లాకు చెందిన జంపనీ సాయిగోపీ విహారి (26) సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వీరు కేపీహెచ్ బీ లోని ఓ హాస్టల్ లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే గంజాయి దందాకు తెరలేపారు. జల్సాలు చేసేందుకు గంజాయి విక్రయాలను చేపట్టారు. ఈ క్రమంలో కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌ డీమార్ట్‌ సమీపంలోని పార్కులో నలుగురు యువకులు గంజాయి విక్రయాలకు తెరలేపారు. కాగా గంజాయి అమ్మకాల గురించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే పార్కు వద్దకు చేరుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించిన యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు.

వారి వద్ద నుంచి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా రాజమండ్రి నుంచి గంజాయిని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఇవేం పనులంటూ పలువురు మండిపడుతున్నారు. డ్రగ్స్ సరఫరాను పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతున్నారు. మరి సాఫ్ట్ వేర్ జాబ్స్ చేస్తూ గంజాయి అమ్ముతున్న యువకులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.