Anand Mahindra- Viral Video Of Umbrella: వీడియో: వర్షాలు వచ్చేశాయి.. ఆనంద్ మహీంద్రా చెప్పిన సలహా పాటించాల్సిందే!

వీడియో: వర్షాలు వచ్చేశాయి.. ఆనంద్ మహీంద్రా చెప్పిన సలహా పాటించాల్సిందే!

Anand Mahindra- Great Idea To Beat This Monsoon: ఆనంద్ మహీంద్రా మరోసారి ఒక అద్భుతమైన వీడియో షేర్ చేశారు. ఈ వర్షాకాలంలో మీరు తడవకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్లేందుకు ఈ ఐడియా బాగా ఉపయోపడుతుంది.

Anand Mahindra- Great Idea To Beat This Monsoon: ఆనంద్ మహీంద్రా మరోసారి ఒక అద్భుతమైన వీడియో షేర్ చేశారు. ఈ వర్షాకాలంలో మీరు తడవకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్లేందుకు ఈ ఐడియా బాగా ఉపయోపడుతుంది.

దేశవ్యాప్తంగా వర్షాలు వచ్చేశాయి. నైరుతి రుతుపవనాలు దాదాపుగా వ్యాపించాయి. ఈసారి వర్షాలు కూడా బాగానే ఉంటాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూనే ఉన్నారు. అటు ముంబయిలో కూడా వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఇన్నాళ్లు భానుడి భగ భగలకు అల్లాడిపోయారు. ఈ వర్షాలతో కాస్త సేదతీరారు. శనివారం సాయంత్రం దాదాపుగా ముంబయి మొత్తాన్ని వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాలకు ఆహ్లాదకరంగానే ఉంటుంది. కానీ, జనజీవనం స్తంభించిపోతుంది. అందుకే వర్షాల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలో ఆనంద్ మహీంద్రా సలహా ఇచ్చారు. ఒక వీడియో షేర్ చేసి ఇది మనం కూడా ట్రై చేయచ్చు అంటూ కామెంట్ చేశారు.

సాధారణంగా ఆనంద్ మహీంద్రా ఎంత పెద్ద వ్యాపారవేత్తో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా.. చాలా విలువైన సమాచారాన్ని షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా.. కొత్త కొత్త ఆవిష్కరణలు, ఐడియాలను ప్రశంసిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఒక వీడియోనే పోస్ట్ చేశారు. పోస్ట్ చేయడమే కాకుండా.. ముంబయిలో వర్షాలు స్టార్ట్ అయ్యాయి. మనం కూడా ఈ పద్ధితిని ట్రై చేయచ్చు అంటూ కామెంట్ చేశారు. అలాగే అతని తెలివితేటలను పొగిడేశారు కూడా. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే.. ఒక వ్యక్తి షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాడు. అయితే అతను తన గొడుగును కాస్త వింతగా వేసుకున్నాడు. ఎవరైనా చేత్తో పట్టుకుని వెళ్లిపోతాం. కానీ, అతను మాత్రం రెండు డ్రెస్ హ్యాంగర్స్ తీసుకుని వాటిని గొడుకుకు సీతాకోక చిలుక రెక్కల మాదిరి అంటించాడు. ఆ తర్వాత వాటిని చొక్కా తరహాలో తగిలించుకున్నాడు. ఇంకేముంది చేత్తో పట్టుకునే పని లేకుండా గొడుగు నెత్తిమీదకు వచ్చేసింది. సాధారణంగా మనం ఒక చేత్తో గొడుగు పట్టుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఈ తరహాలో ట్రై చేస్తే బాగా కంఫర్ట్ గా కూడా ఉండేలా ఉంది. అంతేకాకుండా ఇదొ ఒక మంచి ఆలోచన కూడా. అందుకే ఆనంద్ మహీంద్రా కూడా చూడగానే మెచ్చేసుకున్నారు.

“ఎట్టకేలకు ఈ వర్షాకాలంలో మనం ముంబయిలో ఎడతెరిపిలేని వర్షాన్ని చూస్తున్నాం. మనకు నచ్చేంత భారీగా వర్షం కురవడం లేదు. కానీ, మనం బీరువాని తడి దుస్తులను సర్దుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి. ధరించే గొడుగు అనేది కచ్చితంగా ఒక మంచి ఆలోచన అవుతుంది. క్లవర్” అంటూ ఆనంద్ మహీంద్రా కోట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్స్ కూడా అతని తెలివితేటలను మెచ్చుకుంటున్నారు. చాలాకాలం తర్వాత గొడుగును కొత్తగా వాడటం చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ గొడుగు ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్ర్ రూపంలో తెలియజేయండి.

Show comments