iDreamPost
android-app
ios-app

బాలకృష్ణ బ్యాడ్ సెంటిమెంట్ నిజం అవుతుందా? రేస్ లోకి రవితేజ!

  • Published Aug 17, 2023 | 6:55 PM Updated Updated Aug 17, 2023 | 6:57 PM
  • Published Aug 17, 2023 | 6:55 PMUpdated Aug 17, 2023 | 6:57 PM
బాలకృష్ణ బ్యాడ్ సెంటిమెంట్ నిజం అవుతుందా? రేస్ లోకి రవితేజ!

నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న ఊరమాస్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు సంక్రాంతి, దసరా బరిలోకి వస్తున్నాడు అంటే దాదాపు సినిమా బ్లాక్ బస్టర్ అనే ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డితో అది మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద వీరసింహారెడ్డి కాసుల వరషం కురిపించింది. ఇప్పుడు ఇదే సంవత్సరం దసరాకి మళ్లీ బాలయ్య తన అభిమానులను అలరింపజేసేందుకు సిద్ధమైపోయాడు. ఈసారి భగవంత్ కేసరిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి మాత్రం బాలయ్యను ఒక బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోందనే చెప్పాలి.

బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో ఈ భగవంత్ కేసరి సినిమా రాబోతోంది. అనిల్ రావిపూడి ఇప్పటివరకు అన్ని కామెడీ ఓరియంటెడ్ సినిమాలను మాత్రమే తీశాడు. ఆ సినిమాల్లో యాక్షన్ ఉన్నా అది లిమిటెడ్ గానే ఉండేది. కానీ, ఫర్ ది ఫస్ట్ టైమ్ అనిల్ రావిపూడి బాలయ్యతో కలిసి ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ లో ఈ భగవంత్ కేసరి సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు బాలకృష్ణ ఈ రేంజ్ లో ఎవరూ చూపించి ఉండరు అంటూ డైరెక్టర్ కామెంట్స్ కూడా చేశాడు. దసరా సందర్బంగా ఈ మూవీని అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూసిన తర్వాత అందరూ సినిమా సూపర్ హిట్ అంటూ ఫిక్స్ అయిపోయారు. కానీ, ఇప్పుడు బాలకృష్ణ అభిమానులను ఒక బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది.

రవితేజ దసరా బరిలోకి దిగగానే బాలయ్య అభిమానుల్లో ఒకింత భయం మొదలైందని సినీ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు బాలయ్య- రవితేజ పోటీ పడిన సందర్భాల్లో బాలయ్య సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఆ ట్రాక్ రికార్డును చూసే అభిమానులు ఇప్పుడు ఒకింత కంగారు పడుతున్నారు. గురువారం రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. నిజానికి ఆ టీజర్ ఎంతో బాగుంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భగవంత్ కేసరి విడుదలైన ఒకరోజు తర్వాత. అంటే ఈ దసరాకి బాలయ్య- రవితేజ పోటీ ఖాయం అయిపోయింది. అదే జరిగింతే ఈసారి ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

Balakrishna vs ravi teja again

ఇప్పటివరకు బాలయ్య- రవితేజ పోటీ పడిన సందర్భాలను చూస్తే.. 2008లో ఒక్క మగాడు- కృష్ణ, 2009లో మిత్రుడు- కిక్, 2011లో పరమవీర చక్ర- మిరపకాయ్ సినిమాలు విడుదలయ్యాయి. మళ్లీ పుష్కరం తర్వాత భగవంత్ కేసరి- టైగర్ నాగేశ్వరరావు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సెంటిమెంట్ ని రవితేజ ఫ్యాన్స్ పాజిటివ్ గా తీసుకుని ఆనందం వ్యక్తం చేస్తుంటే.. బాలయ్య అభిమానులు మాత్రం కాస్త కంగారు పడుతున్నారు. అయితే సినిమా విడుదల కాకుండానే రిజల్ట్ ని అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇలాంటివి కేవలం యాధృచ్ఛికంగా జరిగేవి మాత్రమే. అనిల్ రావిపూడి మినిమం గ్యారెంటీ ఉన్న డైరెక్టర్ కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ భరోసాగా ఉండచ్చు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే టైగర్ నాగేశ్వరరావు కూడా విజయం సాధించాలంటూ కోరుకుంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş