Krishna Kowshik
బంగారం ధర పెరగుతుండటం ఇప్పటికే పసిడి కొనుగోలు చేసిన వారికి వరంగా మారినట్లయ్యింది. అలాగే మహిళ పాలిట శాపంగా మారింది. ఒంటిపై నగలు వేసుకోవాలంటే భయపడిపోతున్నారు. తాజాగా
బంగారం ధర పెరగుతుండటం ఇప్పటికే పసిడి కొనుగోలు చేసిన వారికి వరంగా మారినట్లయ్యింది. అలాగే మహిళ పాలిట శాపంగా మారింది. ఒంటిపై నగలు వేసుకోవాలంటే భయపడిపోతున్నారు. తాజాగా
Krishna Kowshik
రోజు రోజుకూ బంగారం ధర పెరిగిపోతుంది. పసిడి ధర ఆకాశాన్ని తాకుతుంది. కొత్తగా గోల్డ్ నగలు కొనే వారికి ఇది మింగుడుపడని విషయమే కానీ.. ఇప్పటికే భారీగా బంగారాన్ని కొనుగోలు చేసేవారికి సంబరమే. అయితే ఇప్పుడు ఈ ధరలు మహిళల పాలిట శాపంగా.. దొంగల పాలిట వరంగా మారాయి. బంగారం విలువ మార్కెట్‌లో అమాతం పెరిగిపోవడంతో చైన్ స్నాచర్స్ మళ్లీ విజృంభిస్తున్నారు. మహిళలు రోడ్డుపై తిరగాలంటేనే భయపడేలా చేస్తున్నారు. పట్టుమని బంగారపు గొలుసు కూడా వేసుకోలేని పరిస్థితికి తీసుకువచ్చారు. బండి మీద చటుక్కున వచ్చి.. మెడలో ఉన్న గొలుసులను దోచుకెళుతున్నారు. ఇప్పుడు అలాంటి దొంగతనమే జరగ్గా.. ఓ డ్రైవర్ వారికి బుద్ధి చెప్పాడు.. అదీ కూడా బస్సుతో దొంగల్ని నిలువరించే ప్రయత్నం చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ ఆటోలో కూర్చొన్న మహిళ మెడలో నుండి ఓ వ్యక్తి చైన్ దొంగతనం చేసి పరారయ్యాడు. అతడిని తీసుకెళ్లేందుకు మరో దొంగ బైక్‌తో రెడీగా ఉన్నాడు. చైన్ లాక్కొని.. వెంటనే అతడి బైక్ పై వెళ్లిపోతుండగా.. పట్టుకొండి .. పట్టుకొండి అంటూ బాధితులు వారిని వెంబడించడం స్టార్ట్ చేశారు. అంతలో వీరి దొంగతనాన్ని గమనిస్తున్న బస్సు డ్రైవర్.. దొంగల్ని నిలువరించేందుకు ప్రయత్నించాడు. వారిని ఢీ కొట్టడంతో బైక్ మీద నుండి ఇద్దరు దొంగలు కింద పడిపోయారు. వెంటనే చైన్ స్నాచర్స్ .. వెంటనే పరుగులు పెట్టారు. కాగా, వెనుక నుండి బాధితులు కూడా పరుగులు తీశారు.
దొంగల్ని పట్టుకునేందుకు కొంత మంది వారిని ఫాలో అయ్యారు. జనాలకు దొరికితే చావు గొడతారని గ్రహించిన చైన్ స్నాచర్స్.. ఎక్కడ ఆగకుండా పరుగులు పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా..? ఒక ఆట ఆడేసుకోరు. బస్సు డ్రైవర్ మంచి పని చేశాడని కొనియాడుతూనే చైన్ స్నాచర్స్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. డ్రైవర్ దొంగల పాలిట యుముడిగా ఎంట్రీ అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ బస్సు కింద పడితే మాత్రం వారిపని అయిపోయేదని అంటున్నారు. దొంగలకు తగిన శాస్త్రి తగిలిందని, ఇది కదా కర్మ అంటే అంటూ రాస్తన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బైక్ నంబరు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే చైన్ స్నాచర్లను పట్టుకుంటామని చెబుతున్నారు. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో చెప్పేయండి.
చైన్ దొంగలకు తగిన శాస్తి జరిగింది
హర్యానా – కర్నాల్‌లో చైన్ స్నాచింగ్ చేసిన వారి బైక్‌ను, బస్సుతో ఢీకొట్టిన డ్రైవర్. pic.twitter.com/URxQcBGlFs
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2024