మంటగలిసిన మానవత్వం.. కానిస్టేబుల్ ప్రాణాలు పోతున్నా..

ఈ రోజుల్లో సాయం అనే పదాన్ని మరిచిపోయారు జనాలు. ఏ సాయం చేస్తే.. ఎటు నుండి ఎటు వస్తుందో అని పలకరించడం కూడా మానేశారు. సాటి మనిషి రోడ్డుపై పడిపోతే మనకెందుకులే అని చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారు.

ఈ రోజుల్లో సాయం అనే పదాన్ని మరిచిపోయారు జనాలు. ఏ సాయం చేస్తే.. ఎటు నుండి ఎటు వస్తుందో అని పలకరించడం కూడా మానేశారు. సాటి మనిషి రోడ్డుపై పడిపోతే మనకెందుకులే అని చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారు.

నేటి కాలంలో మానవుడు మాయం అయిపోతున్నాడు. మానవత్వం కొరవడింది. చివరకు మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా పోయింది. రోడ్డుపై ఎవరికైనా ప్రమాదం జరిగితే.. స్పందించాల్సిన స్థానికులు.. ఏదో సినిమా చూస్తున్నట్లుగా చూస్తున్నారు. అలాగే సెల్ ఫోన్ తీసుకుని వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అంబులెన్స్ కు కాల్ చేయాలని కానీ.. సమీపంలో ఏదైనాా ఆసుపత్రి ఉందేమో అని కనుక్కోవడం కానీ చేయడం లేదు. దీంతో నిండు ప్రాణాలు పోతున్నాయి. పరోక్షంగా వారి మరణానికి కారణమౌతున్నారు. తాజాగా ఇటువంటి ఓ ఘటన ఇప్పుడు మరోసారి మనిషి అన్నవాడున్నాడా ప్రశ్న ఎదురౌతుంది.

ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదైన సంగతి విదితమే. ఓ వైపు వాన, మరో వైపు ఎండలు కాస్తున్నాయి. ఈ వింత వాతావరణాన్ని చూసి ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా ఎండలు మండుతున్నాయి. ఈ వేడిమిని తట్టుకోలేక జనాలు చనిపోతున్నారు. అలాగే వడదెబ్బకు చాలా మంది మృత్యువాత పడ్డారు.  తాజాగా ఓ కానిస్టేబుల్ వడదెబ్బకు గురయ్యాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే.. స్పందించాల్సిన ఉద్యోగులు స్పందించకుండా సెల్ ఫోనులో దృశ్యాలను రికార్డు చేస్తున్నాడు. చివరకు విల విల కొట్టుకుంటూ ఆ కానిస్టేబుల్ ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. మానవత్వం మండగలిపేలా ఉన్న ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

ఝాన్సీ జిల్లాలోని ఖటకాయన్ గ్రామానికి చెందిన  బ్రిజ్ కిషోర్ సింగ్ (52) కాన్పూర్‌లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన మనవరాలి పుట్టినరోజు వేడుకల కోసం మూడు రోజుల సెలవు తీసుకున్నాడు. తిరిగి ఇంటికి వస్తుండగా.. వడదెబ్బకు గురయ్యాడు. హరబన్ష్ మొహల్లా పోలీస్ స్టేషన్ సమీపంలో సృహకోల్పోయాడు. అక్కడే ఉన్న ఎస్ఐ జగ్ ప్రతాప్ కనీసం స్పందించకపోగా.. తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డు చేశాడు. ఓ వైపు మనిషి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. చోద్యం చూసినట్లుగా.. కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆలోచన చేయకుండా సెల్ ఫోనుతో అతడు పడుతున్న ఇబ్బందిని వీడియో తీశాడు.  దీంతో బ్రిజ్ కిషోర్ మరణించాడు.  ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. చర్యలకు ఉపక్రమించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల వర్షన్ మరోలా ఉంది. అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు చెబుతున్నారు. అయితే ఈ వీడియో ఆధారంగా విచారిస్తామని చెబుతున్నారు.

Show comments