నాకు భార్యను వెతికి పెట్టండి.. కలెక్టర్ కు యువకుడి వినతి పత్రం

నేటి కాలంలో చాలా మంది యువతి, యువకులు ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తి పడుతూ పెళ్లిళ్లు అనే మాటే మర్చిపోతున్నారు. ఇక 30 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. ఇలా ఎంతో మంది యవత తలపై బట్ట, ముందు పొట్ట వచ్చి పెళ్లికాని ప్రసాదులు గానే మిగిలిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఓ యువకుడికి అతని తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చాలా చోట్ల అమ్మాయిని వెతికారు. కానీ, అతడిని చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాలేదు. దీంతో ఆ యువకుడు నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి.. నాకు భార్యను వెతికి పెట్టండి అంటూ కలెక్టర్ కు వినతి పత్రం అందించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఒడిశాలోని అనుగుల్ జిల్లా నువాపాడలో సంజీవ్ మహాపాత్ర అనే దివ్యాంగ యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతని తల్లిదండ్రులు వృద్ధులు. దీంతో వాళ్లు చనిపోకముందే కుమారుడికి పెళ్లి చేయాలని అనుకున్నారు. దీని కోసం తెలిసిన బంధువుల్లో అమ్మాయిని వెతికారు. కానీ, ఆ యువకుడు దివ్యాంగుడు కావడంతో పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాలేదు. ఆ సమయంలో సంజీవ్ కు ఏం చేయాలో తోచలేదు. ఇక చేసేదేం లేక ఆ యువకుడు ఇటీవల నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించాడు.

అందులో ఏముందంటే? నేను దివ్యాంగుడిని, నా తల్లిదండ్రులు వృద్ధులయ్యారు. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు భార్యను వెతికి పెట్టండి, దీంతో పాటు ఓ ట్రై సైకిల్ ను కూడా ఇప్పించాలని ఆ యువకుడు కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదే ఘటన ఇప్పడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భార్యను వెతికి పెట్టాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఈ యువకుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: అరుదైన వ్యాధి.. స్నానం చేస్తే చచ్చిపోతుంది!

Show comments