iDreamPost
android-app
ios-app

అరుదైన వ్యాధి.. స్నానం చేస్తే చచ్చిపోతుంది!

  • Published Aug 08, 2023 | 11:59 AM Updated Updated Aug 08, 2023 | 11:59 AM
  • Published Aug 08, 2023 | 11:59 AMUpdated Aug 08, 2023 | 11:59 AM
అరుదైన వ్యాధి.. స్నానం చేస్తే చచ్చిపోతుంది!

ప్రియుడితో బ్రేకప్‌ ఆమెలో పెను మార్పు తీసుకువచ్చింది. లావుగా ఉన్న కారణంగా అతడు బ్రేకప్‌ చెప్పాడన్న​ బాధ ఆమెను చావుకు దగ్గర చేసింది. సన్నగా మారాలన్న గట్టి పట్టుదలతో సరిగా తినకపోవటంతో దారుణమైన వ్యాధి ఆమెను చుట్టుముట్టింది. ఆ వ్యాధి కారణంగా ఆమె జీవితం దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులా మారింది. బరువు బాగా తగ్గటం వల్ల.. స్నానం చేస్తే ఆమెకు గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. గుండెపోటు కారణంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ఆ యువతి విషాద కథ ఏంటంటే.. జెస్సి జోన్స్‌ అనే యువతికి 2020లో తన ప్రియుడితో బ్రేకప్‌ అయింది. ఆమె లావుగా ఉందన్న కారణంతో అతడు ఆమెను వదిలేశాడు.

దీంతో జెస్సీ జోన్స్‌ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గి ప్రియుడికి గుణపాఠం చెప్పాలని భావించింది. 2020నుంచి డైటింగ్‌ చేస్తూ వస్తోంది. సరిగా తినటం మానేసింది. కొన్ని ఆహార పదార్థాలను పూర్తిగా అవాయిడ్‌ చేసింది. ఆ డైటింగ్‌ చివరకు ఓ మానసిక రోగంలా మారింది. కొన్ని పదార్ధాలు తనకు సెట్‌ కావని ఆమె మానసికంగా డిసైడ్‌ అయిపోయింది. దీంతో ఆమె చాలా బరువు తగ్గింది. ఎముకల గూడును తలపించేలా మారిపోయింది. కూతురిలో ఈ మార్పులను గుర్తించిన జెస్సి తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ‘అనొరెక్సియా’ అనే వ్యాధి వచ్చినట్లు తేల్చారు. బరువు ప్రమాదకర స్థాయికి తగ్గిపోవటం వల్ల ఆమె స్నానం చేస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తేల్చారు. అంతేకాదు! స్నానం చేస్తే ఆమె చనిపోయే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. తనకు వచ్చిన ఈ వ్యాధిపై జెస్సి మాట్లాడుతూ.. ‘‘నేను మరీ అంతలావుగా ఉండేదాన్ని కాదు. ఓ మోస్తరు స్లిమ్‌గానే ఉండేదాన్ని. బ్రేకప్‌ కారణంగా రివేంజ్‌ బాడీ సాధిద్దాం అనుకున్నాను. నేను డైటింగ్‌ కారణంగా చాలా బలహీనంగా తయారయ్యాను.

ఇప్పుడు నేను దీన్ని ఆపలేని పరిస్థితికి వచ్చాను. నేను స్నానం చేయకూడదని డాక్టర్లు చెప్పారు. స్నానం చేస్తే ఆ ఒత్తిడికి నాకు గుండె పోటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. నాకు పీరియడ్స్‌ రావటం కూడా ఆగిపోయింది. అంతేకాదు! సంతాన సమస్యలు కూడా వచ్చాయి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరి, బ్రేకప్‌ బాధతో రివెంజ్‌ బాడీ సాధిద్దామని ప్రాణాల మీదకు తెచ్చుకున్న జెస్సి ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibomgrandpashabet