iDreamPost

పెళ్లి పీటలపై తాళిని విసిరి కొట్టిన వధువు! కారణం ఏమిటంటే?

  • Published Aug 23, 2023 | 1:15 PMUpdated Aug 23, 2023 | 1:15 PM
  • Published Aug 23, 2023 | 1:15 PMUpdated Aug 23, 2023 | 1:15 PM
పెళ్లి పీటలపై తాళిని విసిరి కొట్టిన వధువు! కారణం ఏమిటంటే?

పెళ్లి.. రెండు జీవితాలను ముడి వేసే మూడుముళ్ల బంధం. ఇంతటి పవిత్రమైన కార్యక్రమం ఏ అడ్డంకి లేకుండా సాఫీగా సాగిపోవాలని అంతా కోరుకుంటుంటారు. అయితే.. కొన్ని పెళ్లిళ్లు మాత్రం అర్ధాంతరంగా పీటలపైనే ఆగిపోతుంటాయి. కట్నకానుకల లెక్క తేలలేదనో, పెళ్లి మర్యాదల్లో లోటు వచ్చిందనో, భోజనాల్లో చికెన్, మటన్ తక్కువైందనో కూడా ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు చూస్తున్నాం. అయితే.. వీటన్నిటికి బయట వ్యక్తులు కారణం అవుతుంటారు. కానీ, తాజాగా ఓ పెళ్లి కూతురు.. తన పెళ్లిని తానే ఆపేసుకుంది. అది కూడా చివరి క్షణంలో! వరుడు తాళి కట్టడానికి పైకి లేవగానే, ఆమె ఆ తాళిని పక్కకి విసిరేసింది. సినిమాని మించిన ట్విస్ట్‌లున్న ఈ పెళ్లి కహాని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అది తమిళనాడులోని రామనాథపురం జిల్లా. ఆ జిల్లాలో తిరువాడానై వద్ద ఉన్న ఓ గ్రామానికి చెందిన 29 ఏళ్ల యువకుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దలు అతనికి పెళ్లి కుదర్చడంతో కొన్ని నెలల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి వధువు. ఈ సోమవారం ఉదయం తిరువాడానైలో ఉన్న ఓ ఆలయంలో వీరి వివాహ కార్యక్రమం మొదలైంది. బంధువులు, మిత్రులతో అంతా సందడి నెలకొంది. మరోవైపు ఘుమఘుమలాడించే వంటలతో భోజనాలు మొదలయ్యాయి. ముహూర్త సమయానికి మాంగళ్యధారణ చేయడానికి పెళ్లికొడుకు పైకి లేవగా.., తల వంచుకుని కూర్చున్న పెళ్లి కూతురు ఒక్కసారిగా సివంగిలా చిందులేసింది. తనకి ఈ పెళ్లి వద్దంటూ కేకలేస్తూ.. తాళిని దూరంగా విసిరికొట్టింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా ఆమె మాట వినలేదు.

పెళ్లి ఇలా పీటలపై ఆగిపోవడాన్ని వరుడు అవమానంగా భావించి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువతిని ప్రశ్నించగా సంచలన నిజం బయట పడింది. “నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను మరొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మా అమ్మ, నాన్న నా మాట వినకుండా.. ఇష్టం లేని ఈ పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారు. మనసులో ఒకరిని పెట్టుకుని, మరొకరితో జీవితాన్ని పంచుకోలేను” అంటూ పెళ్లికూతురు కన్నీరు పెట్టుకుంది. ఇక ఆమె బాధని అర్థం చేసుకున్న పెళ్ళికొడుకు కూడా అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయాడు. దీంతో.. పెళ్ళికి వచ్చిన పెద్దలంతా.. అమ్మాయి తల్లిదండ్రులను నిందించడం మొదలు పెట్టారు. పోలీసులు మాత్రం యువతికి, ఆమె పెద్దలకి కౌన్సలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. కానీ.., పెళ్లి కోసం విదేశాల నుంచి ఎన్నో ఆశలతో ఇక్కడికి చేరుకున్న ఆ పెళ్లి కొడుకుకి మాత్రం నిరాశ ఎదురైంది. మరి.. ఈ మొత్తం వ్యవహారం తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సినిమా స్టైల్లో భార్య స్కెచ్.. భర్తను నమ్మించి తీసుకెళ్లి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి