పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ పెరిగిన ధరలు… ఈ రోజు ఎంతంటే?

Today Gold Rate: నిన్న మొన్నటి వరకు పసిడి ధర తగ్గినట్టే తగ్గి.. మళ్లీ ఒక్కసారిగా పెరిగి భారీ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజుల క్రితం బంగారం ధర వరుసగా తగ్గడంతో కోనుగోలుదారులు సంఖ్య పెరిగింది. కానీ, నేడు ఊహించని విధంగా పసిడి ధరలు పెరిగి ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంతకీ నేడు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Today Gold Rate: నిన్న మొన్నటి వరకు పసిడి ధర తగ్గినట్టే తగ్గి.. మళ్లీ ఒక్కసారిగా పెరిగి భారీ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజుల క్రితం బంగారం ధర వరుసగా తగ్గడంతో కోనుగోలుదారులు సంఖ్య పెరిగింది. కానీ, నేడు ఊహించని విధంగా పసిడి ధరలు పెరిగి ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంతకీ నేడు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ప్రతిఒక్కరికి బంగారం కొనాలని ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఈ విషయంలో మహిళ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే.. మహిళలకు బంగారంకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఈ క్రమంలోనే ఏ పండగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యలు వస్తే చాలు మహిళలు బంగారం కొనేందుకు షాపులకు ఎగబడుతుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో బంగారం కొనాలకునే వారికి వరుస షాకులు మీద షాకులు తగులుతునే ఉన్నాయి. ఎందుకంటే.. గత కొన్ని నెలలుగా బంగారం ధర తగ్గినట్టే తగ్గి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ నెల కూడా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం నాలుగు రోజులు పెరిగిపోతూ వస్తుంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు బంగారం, వెండి ధరలపై పడుతున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. నేడు మార్కట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నిన్న మొన్నటి వరకు పసిడి ధర తగ్గినట్టే తగ్గి.. మళ్లీ ఒక్కసారిగా పెరిగి భారీ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజుల క్రితం బంగారం ధర వరుసగా తగ్గడంతో కోనుగోలుదారులు సంఖ్య పెరిగింది. కానీ, నేడు ఊహించని విధంగా పసిడి ధరలు పెరిగి ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంతకీ నేడు మంగళవారం( సెప్టెంబర్ 24) నాటికి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి తులం రూ. 69,800 మార్కు వద్ద ఉంది. అంతకుముందు వరుసగా రెండు రోజుల వ్యవధిలోనే రూ. 1350 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 220 ఎగబాకి రూ. 76,150 కి చేరడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు ఎగబాకాయి. ఇక్కడ 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ. 200 పెరగడంతో తులం రూ. 69,950 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములు రూ. 76,300 పలుకుతోంది. అలాగే చెన్నైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,512 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,740 గా కొనసాగుతుంది. ఇక కేరళలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కేరళ రూ. 68,521 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.74,750 కొనసాగుతుంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ బంగారం ధర రూ.68,218 ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.74,420 వద్ద ఉంది. అయితే బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి రేట్లు మాత్రం స్థిరంగానే ఉన్నాయి.  ఢిల్లీలో ప్రస్తుతం కేజీ వెండి రేటు రూ. 93 వేల వద్ద ఉంది. సెప్టెంబర్ 20, 21 తేదీల్లో రూ. 2 వేల మేర పెరిగింది. ఇక హైదరాబాద్ నగరంలో చూస్తే.. కేజీ సిల్వర్ రేటు రూ. 98 వేల వద్ద కొనసాగుతోంది.

 

Show comments