iDreamPost

హైదరాబాద్‌లో ఏళ్లుగా కాంగ్రెస్ గెలవని స్థానాలు ఇవే!

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. ఈ నెల 30న 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.  శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. తెలంగాణలో ఎన్నికల వేళ కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కి కొన్ని ఏళ్లుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు దక్కలేదు

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. ఈ నెల 30న 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.  శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. తెలంగాణలో ఎన్నికల వేళ కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కి కొన్ని ఏళ్లుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు దక్కలేదు

హైదరాబాద్‌లో ఏళ్లుగా కాంగ్రెస్ గెలవని స్థానాలు ఇవే!

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. ఈ నెల 30న 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.  శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక అధికార బీఆర్ఎస్ అయితే ముచ్చటగా మూడో సారి విజయం కోసం గట్టి ప్రణాళికలను  రచిస్తోంది. ఇక తెలంగాణ ఎన్నికల వేళ కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కి ఏళ్లుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు దక్కలేదు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం కోసం తీవ్రంగా కృషి  చేస్తుంది. ఈ సారి ఎలాగైన అధికారం చేజిక్కించుకోవాలని ప్రణాళిలను రచిస్తోంది. అయితే ఇదే సమయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఫొకస్ పెట్టింది. అక్కడ కొన్నేళ్లుగా కాంగ్రెస్ విజయం సాధించాలేదు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఏళ్లుగా ఓడిపోతూనే ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఆసక్తిని కలిగించే నియోజకవర్గాల్లో ఇబ్రహింపట్నం ఒకటి. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వ నేనా అన్నట్లు ఉంటుంది. అయితే ఇబ్రహింపట్నంలో 1985 నుంచి 2018  వరకు ఒక్కసారీ కూడా కాంగ్రెస్ గెలవలేదు. అలానే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్ పేట్ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం లేదు.

అంబర్ పేట్ నుంచి  1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వీహెచ్ గెలిచారు. అయితే ఆ తరువాత జరిగిన  సార్వత్రిక ఎన్నికల్లో అంబర్ పేట్ లో కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు. కూకట్ పల్లిలో 2009 నుంచి 3 సార్లు  జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. సికింద్రాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో కూడా 2014,2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడైనా పట్టు నిలుపుకోవాలని అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. మరి.. వచ్చే ఎన్నికల్లో అయినా ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి