P Venkatesh
తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై వారికి అందించే పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచుతూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై వారికి అందించే పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచుతూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
P Venkatesh
తెలంగాణలో నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఆరోగ్య శ్రీ పథకం పరిధిని రూ. 10 లక్షలకు పెంచింది. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వారికి రూ. 10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. తాజాగా నష్ట పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచుతు అటవీశాఖ ఉత్తర్వుల జారీ చేసింది. ఇకపై వారికి రూ. 10 లక్షల పరిహారం అందనుంది. ఇంతకీ ఎవరికి ఈ పరిహారం? ఎందుకు ఈ పరిహారాన్ని అందిస్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
రాష్ట్రంలో వ్యవసాయాధారిత కుటుంబాలు ఎక్కువ. వీరు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు వన్య మృగాల దాడులకు గురవుతుంటారు. వీరే కాకుండా సాధారణ ప్రజలు సైతం అప్పుడప్పుడు వన్యప్రాణుల దాడులకు గురవుతుంటారు. పులులు, ఎలుగుబంట్లు దాడుల్లో ఇదివరకు చాలా మంది గాయపడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. అయితే వన్యప్రాణుల దాడుల్లో గాయపడినా, లేదా మరణించిన వారికి నష్ట పరిహారాన్ని పెంచుతూ అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు వణ్యప్రాణుల దాడికి గురై మరణించిన బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తుండేవారు. తాజాగా ఆ పరిహారాన్ని రూ. 10 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. వన్యప్రాణుల దాడుల్లో మరణిస్తే బాధిత కుటుంబానికి నష్ట పరిహారంగా రూ. 10 లక్షలు అందిస్తారు. దాడుల్లో స్వల్పంగా గాయపడితే గతంలో చికిత్స వ్యయాన్ని ఇస్తుండగా.. ఇప్పుడు గరిష్ఠంగా రూ.లక్ష, తక్షణ సాయం రూ.10 వేలు అందిస్తారు. తీవ్రంగా గాయపడితే గరిష్ఠంగా రూ.3 లక్షలు, ఎక్స్‌గ్రేషియాగా రూ.లక్ష మంజూరు చేస్తారు. పశువులు మరణిస్తే గరిష్ఠంగా రూ.50 వేలు చొప్పున చెల్లిస్తారు. అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే ఎకరాకు ఇచ్చే పరిహారాన్ని రూ.6 వేల నుంచి రూ.7,500కు పెంచారు.
అటవీ శాక తాజా ఉత్తర్వుల ప్రకారం.. పాములు, కోతుల కారణంగా ఎవరైనా మృతిచెందినా, గాయపడ్డా పరిహారం అందించబడదని అధికారులు తెలిపారు. ఒక వేళ వ్యక్తులపైగాని, పంటలపై గాని దాడి జరిగినట్లైతే ఆ ప్రాంతాన్ని 48 గంటల్లోగా ఎస్సై లేదా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరిశీలించి ఉండాలన్నారు. అటవీ శాఖకు చెందిన భూములను ఆక్రమించి పండించే పంటలకు నష్ట పరిహారం ఇవ్వబడదని అధికారులు స్పష్టం చేశారు. మరి వన్యప్రాణుల దాడిలో మృతి చెందిన వారికి అటవీ శాఖ నష్టపరిహారం పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.