iDreamPost
android-app
ios-app

వరద బాధితుల ఖాతాల్లో రూ.16,500 జమ! రాని వాళ్లు ఇలా చేయండి?

  • Published Sep 10, 2024 | 12:12 PM Updated Updated Sep 10, 2024 | 12:12 PM

Compensation for Flood Victims in Telangana: గత నెల రోజులుగా తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తగా జలమయం అయ్యాయి.. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ బంద్ అయ్యింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Compensation for Flood Victims in Telangana: గత నెల రోజులుగా తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తగా జలమయం అయ్యాయి.. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ బంద్ అయ్యింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Published Sep 10, 2024 | 12:12 PMUpdated Sep 10, 2024 | 12:12 PM
వరద బాధితుల ఖాతాల్లో రూ.16,500 జమ! రాని వాళ్లు ఇలా చేయండి?

దేశంలో ఈ ఏడాది రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, బీహార్, అస్సాం, కేరళా, ఏపీ, తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ తో పాటు పలు  జిల్లాల్లో   వరద ఉధృతి బీభత్సం మిగిల్చింది. పలు కాలనీలు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వరద బీభత్సంలో సర్వస్వం కల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వరద బాధితులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలు, కాల్వలు, చెరువులు నిండుకుండలా మారాయి. కొన్నిప్రాంతాల్లో చెరువులు, కాల్వలకు గండ్లు పడటంతో గ్రామాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం జిల్లాను మున్నేరు వాగు ముంచేత్తింది. పలు కాలనీలు జలదిగ్భంధం అయిన విషయం తెలిసిందే. వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం చివరి బాధితుడి వరకు సాయం అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున సాయం అందిస్తామని అన్నారు. సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

khammam

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ‘ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరదలు తోడై తీవ్రంగా నష్టం వాటిల్లింది.వరదల కారణంగా నష్టపోయిన జిల్లాలను ప్రభావిత జిల్లాలుగా ప్రకటించాం. ఒక్కో శాఖ పరిధిలో ఎంత నష్టం జరిగిందనే విషయంపై అంచనాలు వేసేందుకు అధికారులను నియమించారు. కేంద్రానికి పొందుపర్చాల్సిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాం.రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల 358 గ్రామాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు రెండు లక్షల మంది నష్టపోయారు. బాధితు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా 33 మంది మృతి చెందారు.. వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. అలాగే పాక్షికంగా, పూర్తిగా కూలిపోయిన ఇళ్లను గుర్తించి ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (సెప్టెంబర్ 10) వరద బాధితుల అకౌంట్లో డబ్బులు వేస్తాం. డబ్బుల పంపిణీ విషయంలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా బాధితుల అకౌంట్ లోకే నేరుగా డబ్బులు వేస్తాం. ముంపునకు గురైన ప్రతి ఎకరానికి రూ.10 వేల చొప్పన సాయం అందేలా చూస్తాం’ అని అన్నారు.

ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల మీ అకౌంట్ లో డబ్బులు జమ కాకుంటే వెంటనే సంబంధిత గ్రామ, మండల స్థాయి అధికారు వద్దకు వెళ్లి వివరాలు తెలియజేయాలి. అధికారులకు ఇచ్చిన అకౌంట్ సరిగా చెక్ చేసుకోండి. బ్యాంక్ కు వెళ్లి ఏమైనా ఫ్రీజ్ అయ్యిందా? లేదా? అన్న విషయం ఎంక్వైయిరీ చేయండి. బ్యాంక్ అకౌంట్ తో పాటు ఇతర పత్రాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాల్సిందిగా అధికారులకు తెలియజేయాలి. అన్నీ సరిగా ఉంటే సులభంగా డబ్బు పొందవొచ్చు.