iDreamPost
android-app
ios-app

రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో లక్ష రూపాయలు జమ!

  • Published Aug 23, 2024 | 1:39 PM Updated Updated Aug 23, 2024 | 1:39 PM

Tg Govt Good News for Womens: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించారు.

Tg Govt Good News for Womens: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించారు.

రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో లక్ష రూపాయలు జమ!

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్.. ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీల కింద మహిళల కోసం అనేక పథకాలు తీసుకువచ్చింది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు. అంతేకాదు త్వరలో రేషన్ కార్డు ఉండి అర్హులైన పేద మహిళలకు రూ.2500 రూపాయలు వరకు అందిస్తామని ప్రకటించారు. ఇటీవల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడంతో పాటు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆరు గ్యారెంటీ పథకాల అమలు చేయడమే కాదు, రాష్ట్రాభివృద్ది కోసం విదేశీ పెట్టుబడులు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో లక్ష రూపాయల నగదు జమ చేసింది. వివరాల్లోకి వెళితే..

ఇంట్లో పెళ్లీడుకు వచ్చిన ఆడ పిల్ల ఉందంటే ఆ కుటుంబంలో ఆర్థిక అవసరాలు ఎన్నో ఉంటాయని అందరికీ తెలిసిందే. నిశ్చితార్థం మొదలు పెళ్లి తంతు ముగిసే వరకు ఆడ పిల్ల తల్లిదండ్రులకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. పేదరికంలో ఉన్నవారు ఆర్థిక అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆడపిల్లలు భారం అనే భావన తొలగించేలా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ లేదా షాదీ ముభాకర్ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన వారికి రూ.లక్ష రూపాయల చెక్కు అందజేస్తుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆడపిల్లకు కల్యాణ లక్ష్మి స్కీమ్ లో భాగంగా లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం కానుకగా ఇస్తామని హామీ ఇచ్చిందింది.

ఈ మేరకు ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన బడ్జెట్ లో కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.2175 కోట్లను కేటాయించింది. తాజాగా తెలంగాణ కల్యాణ లక్ష్మీ పథకానికి రూ.1225.43 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు 65,026 కల్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 33,558 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గత ఏడాది అంటే మార్చి 31, 2023 వరకు మరో 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఇందులో 208 దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించబడ్డాయని తెలిపారు. ఇప్పటి వరకు ఎమ్మార్వోల 28,225 దరఖాస్తులు, 12,555 దరఖాస్తులు ఆర్డీవోల వద్ద పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. 24,038 కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు నిధులు రిలీజ్ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.