iDreamPost
android-app
ios-app

TGSRTC ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!

  • Published Sep 06, 2024 | 8:49 AM Updated Updated Sep 06, 2024 | 8:49 AM

Good News for RTC Employees: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుసంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగిస్తున్నారు.

Good News for RTC Employees: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుసంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగిస్తున్నారు.

TGSRTC ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 సిలిండర్ వంట పథకాలు అమలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ వినాయక చవితి పండుగ వేళ తెలంగాణ ఆర్టీసీ కండక్టర్లకు గొప్ప శుభవార్త అందించారు. ఆర్టీసీ కండక్టర్లకు 2013 పీఆర్సీ కి సంబంధించిన బకాయి బాండ్ల డబ్బలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. 14వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులకు రూ.85 కోట్లు ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ వాటా రూ.57 కోట్లు ఉండగా, ఆర్టీసీ వాట రూ.28 కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. 2013 పీఆర్సీ 2015 లో అమలు కాగా, 50 శాంతం మొత్తానికి యాజమాన్యం బాండ్లు జారీ చేసింది. వీటి గడువు 2020 లో ముగియడంతో ఉద్యోగులు పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా ఆ సమస్య పరిష్కరించేందుకు రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఎన్నో పొరపాట్లు చేసిందని.. తమ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా వారికి అందాల్సిన ప్రతి బెనిఫిట్స్ అందేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అన్నారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ ఆర్టీసీ లాభాల పట్టింది. ఇటీవల మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయిందని సజ్జనార్ అన్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నా.. ఆర్టీసీ ఉద్యోగులు ఓపికతో తమ విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.