P Krishna
Key Decision of Telangana Govt: గత రెండు నెలలుగా తెలంగాణ, ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Key Decision of Telangana Govt: గత రెండు నెలలుగా తెలంగాణ, ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
P Krishna
ఇటీవల తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేశాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో చిగురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో నదులు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు వరద నీరు వచ్చి చేరింది. ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10 వేలు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్.. కేంద్ర ప్రభుత్వ నేతలను కలవనున్నారని, వారికి ఇక్కడ వరద నష్టాన్ని వివరించి ఆర్థిక సాయం కోరతారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలో వరద బాధితులను పరామర్శించిన మంత్రి వారికి ధైర్యం చెప్పారు. వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.10 వేల కోట్లకు పై చిలుకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో పంటనష్టం వాటిల్లింది.అయితే ప్రతిసారి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పొంగులేటి తెలిపారు. ప్రతి పోలీస్ బెటాలియన్ నుంచి వంద మందికి విపత్తు నిర్వహణలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. వరద విపత్తులకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన అన్నారు. వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన వారి ఖాతాల్లో ఏకరాకు రూ.10 వేల చొప్పున త్వరలో జమ చేస్తామని వరద బాధితులకు భరోసా ఇచ్చారు.