iDreamPost
android-app
ios-app

‘ది గోట్’ మూవీ రిలీజ్.. విజయ్ కి TG సర్కార్ గుడ్ న్యూస్!

  • Published Sep 04, 2024 | 9:18 PM Updated Updated Sep 04, 2024 | 9:18 PM

The Goat Movie: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ‘ది గోట్’ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

The Goat Movie: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ‘ది గోట్’ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

  • Published Sep 04, 2024 | 9:18 PMUpdated Sep 04, 2024 | 9:18 PM
‘ది గోట్’ మూవీ రిలీజ్.. విజయ్ కి  TG సర్కార్ గుడ్ న్యూస్!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గోట్ (G.O.A.T) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో దళపతి విజయ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఈ మూవీ వినాయక చవితి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గురువారం, సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది. తాజాగా ది గోట్ మూవీ మేకర్స్ కి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఏ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ దళపతి విజయ్ కే ఉందని అంటారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్, అందాల భామ మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ‘ది గోట్’ మూవీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ అదనపు షోస్ వేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సినిమా తెగుులోకి తీసుకు వస్తున్న మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ అదనపు షో వేయడానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. రిలీజ్ అయిన రోజు ఉదయం 4 గంటల షో కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హైదరాబాద్ లోని 15 ధియేటర్లకు ఈ బెనిఫిట్ షో అనుమతిస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈసారి ఏపీ, తెలంగాణలో విజయ్ నటిస్తున్న ది గోట్ మూవీపై భారీ ఎత్తున బిజినెస్ జరగడం విశేషమనే చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ 21 కోట్లు జరిగినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. రేపు ధియేటర్లలో విడుదల అయిన తర్వాత మూవీ టాక్ ని బట్టి ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి. ఒకవేళ ఈ మూవీ గురించి మౌత్ టాక్ పాజిటీవ్ గా ఉంటే.. ది గోట్ కలెక్షన్లను ఆపడం కష్టమే అంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss