Arjun Suravaram
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే.. ఆయన జీతం ఎంతా? అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే.. ఆయన జీతం ఎంతా? అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
Arjun Suravaram
చాలా మందికి రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా సరే చట్టసభల్లోకి ఒక్కసారి అడుగు పెడితే..ప్రభుత్వం తరపున వారికి అనేక సదుపాయాలు ఉంటాయి. జీతం కాకుండా అదనపు అలవెన్సులు కూడా ఉంటాయి. ఇక ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఎమ్మెల్యేలు, ఎంపీ, సీఎం, మంత్రులుగా ఉన్నవారికి వచ్చే జీతాలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. అదే విధంగా మాజీ ప్రజాప్రతినిధులకు సైతం పెన్షన్ అందుతుంది. ఇది ఇలా ఉంటే.. అందరిలో ఇప్పుడు సందేహం వ్యక్తమవుతుంది. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీతం ఎంత ఉంటుంది అని కొందరు తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముగిసిన సంగతి తెలిసిందే. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించింది. దాదాపు పదేళ్ల తరువాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారం చేపట్టింది. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
ఇదే సమయంలో కొత్త సీఎం రేవంత్ రెడ్డి జీతం ఎంత ఉంటుందో? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.4. 21 లక్షల జీతాన్ని పొందుతారని సమాచారం. అలాగే స్పీకర్ రూ.4.11 లక్షల జీతం తీసుకుంటారంట. వారికి వినియోగించే వాహన రుణ పరిమితిని సైతం రూ.15 లక్షల నుంచి 40 లక్షలకు పెంచారు. అంతేకాక వారికి అపరిమితి వైద్యం కూడా అందుతోంది.
రేవంత్ కంటే ముందు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ అత్యధిక వేతనం తీసుకున్నారు. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారి జీతం చాలా ఎక్కువగా ఉండేది. దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న సీఎంగా కూడా ఆయనే కావడం విశేషం. గతంలో సీఎం కేసీఆర్ జీతం అక్షరాల 4.10 లక్షలు ఉంది. తాజాగా రేవంత్ రెడ్డి రూ.4.21 లక్షలతో కేసీఆర్ కంటే ముందు ఉన్నారు. ఇక తెలంగాణ ఏర్పడక ముందు ఎమ్మెల్యే జీతాలు చాలా తక్కువ ఉండేవి. అప్పట్లో ఎమ్మెల్యే నెల జీతం రూ. 12,000 ఉండగా.. రూ.20,000కి పెరిగింది.
నియోజకవర్గానికి సంబంధించిన ఇతర అలవెన్సులు రూ.83,000 నుంచి రూ.2.3 లక్షల పెరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం 163 శాతం పెరిగి తెలంగాణలోని ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల కంటే అత్యధిక వేతనాన్ని పొందుతున్నారు. ఇక తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గురువారం పలువురు ఐఏఎస్ ల బదిలీలు కూడా జరిగాయి. హెచ్ఎండీఏ సంయుక్త కమిషనర్ గా ఆమ్రపాలిని నియమించారు. మరి.. ప్రజాప్రతినిధులకు వస్తున్న జీతం విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.