iDreamPost
android-app
ios-app

పవన్‌ కళ్యాణ్‌ను పట్టించుకోని తెలంగాణ CM రేవంత్ రెడ్డి..

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కీలక నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలకు , సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం రాలేదు.

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కీలక నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలకు , సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం రాలేదు.

పవన్‌ కళ్యాణ్‌ను పట్టించుకోని తెలంగాణ CM రేవంత్ రెడ్డి..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. నేడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురికి ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానించారు. అలాగే ఈ ప్రమాణ స్వీకారానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానాలు అందాయి.

హైదరాబాద్‌లోని లాల్ బహుదూర్ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.  ప్రజలు కూడా ఈ వేడుకకు రావాలని పిలుపునిచ్చారు. అయితే జనసేన అధినేతకు పవన్‌ కళ్యాణ్‌కు మాత్రం ఆహ్వానం పంపలేదు. రాజకీయ ఆహ్వానితుల జాబితాలో కానీ, సినీ ప్రముఖుల జాబితాలో కానీ ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. పవర్ స్టార్‌ను ఆహ్వానించలేదు. పూర్తిగా ఆయనను విస్మరించినట్లు సమాచారం. తెలంగాణలో బీజెపీతో పొత్తు పెట్టుకోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజెపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసిన అన్నింటిల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. తెలంగాణ ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్, ఈ ఎలక్షన్లలో తమ పార్టీ విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. ఛాలెంజ్ చేశారు.

కానీ డిపాజిట్లు కోల్పోయారు. పోనీ ఫలితాలు వెలువడిన తర్వాత ఒక్క మాట మాట్లాడలేదు పవన్. కనీసం ఓటమికి కారణాలు కానీ, గెలిచిన పార్టీకి అభినందనలు కానీ తెలపలేదు. ఎంత ప్రత్యర్థులైన కనీసం అభినందలు తెలుపుతారు. అందులోనూ ఓ పార్టీకీ అధినేత అయ్యి ఉండి కూడా సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. ఈ క్రమంలోనే ఆయనకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే.. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని భావిస్తున్నారు పవన్. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుతో సమావేశమై చర్చలు జరిపారు. ఏపీలో వైఎస్సార్ ప్రభుత్వాన్ని ఓడిస్తామని అన్నారు. ఇంతలా పవన్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. ఆయనకు పొలిటికల్ లీడర్‍గా కానీ, సినిమా వ్యక్తిగా గానీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. మరీ మీరేమంటారో అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి