iDreamPost
android-app
ios-app

పవన్ కల్యాణ్‌ను పట్టించుకోని తెలంగాణ బీజేపీ! కారణం అదే..

పవన్ కల్యాణ్‌ను పట్టించుకోని తెలంగాణ బీజేపీ! కారణం అదే..

ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ అవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలలుగంటున్నారు. అందుకే వారాహి యాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అంతేకాక ఎక్కువ స్థానాల్లో జనసేనాను గెలిపిస్తే.. తాను సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. ఇదే సమయంలో తెలంగాణలో మాత్రం 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తమ భాగస్వామిగా ఉన్న జనసేన పోటీ అంశంపై తెలంగాణ బీజేపీ పట్టించుకోనట్లే ఉంది.

జనసేన బీజేపీ కూటమి అయినా ఎన్డీఏలో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీతో అధికారికంగా పొత్తులో ఉంటూనే, టీడీపీతో అంటకాగడంపై జాతీయ అధికార పార్టీ సీరియస్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేన 32 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించిన.. ఆ రాష్ట్ర బీజేపీ మాత్రం పట్టించుకోలేదు. తెలంగాణలో బీజేపీ పోటీపై ఆ పార్టీ జాతీయ నాయకుడు బండి సంజయ్  చేసిన కీలక వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి. తెలంగాణలో బీజేపీ ఒంటరి పోటీ చేస్తుందని బండి సంజయ్ తేల్చి చెప్పారు. బీజేపీకి తెలంగాణాలో అనుకూల వాతావరణం ఉందని ఆయన అన్నారు. ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇది ఉండగా జనసేన తనకు తానుగా తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించడం బీజేపీకి నచ్చలేదని టాక్ వినిపిస్తోంది.

అందుకే  జనసేన పార్టీని పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ బీజేపీ ఓ నిర్ణయానికి  వచ్చినట్లు  ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పవన్ కి రాజకీయంగా నిలకడ లేదని, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నారని  బీజేపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాక తెలంగాణలో కాపుల ఓట్లను బీజేపీకి పడకుండా కేసీఆర్ కు లబ్ధి కలిగించేందుకే పవన్ ఎన్నికల బరిలో నిలుస్తోన్నాడని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు.  జనసేన వైఖరి ఓట్లను చీల్చి, ఏదో ఒక పార్టీకి లబ్ధి కలిగించి తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడమే లక్ష్యంగా కనిపిస్తోందని కొందరు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే జనసేన తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించినా.. బీజేపీ నేతలు ఎవరు స్పందించలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతలు పవన్ పక్కన పెట్టేశారని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. మరి.. పవన్ ని తెలంగాణ బీజేపీ పక్కన పెట్టినట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి