iDreamPost
android-app
ios-app

కర్ణాటక నుంచి వందల కోట్లు తెలంగాణకు వస్తున్నాయి: KTR

  • Author Soma Sekhar Published - 04:09 PM, Fri - 13 October 23
  • Author Soma Sekhar Published - 04:09 PM, Fri - 13 October 23
కర్ణాటక నుంచి వందల కోట్లు తెలంగాణకు వస్తున్నాయి: KTR

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడమే ఆలస్యం.. గుట్టలు గుట్టలుగా డబ్బులు, కేజీల కొద్ది బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక ఐటీ దాడుల్లో దొరుకుతున్న డబ్బుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా తెలంగాణలో ఎన్నికల కోసమని కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తున్నారని, ఐటీ దాడుల్లో రూ. 42 కోట్లు దొరికినట్లు వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఓట్లు కొనుగోలు కోసం కర్ణాటక నుంచి వందల కోట్లు వస్తున్నాయని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో గుట్టలు గుట్టలుగా డబ్బు కట్టలతో పాటు, కేజీల కొద్ది బంగారం, వెండి దొరుకుతున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికల కోసమని కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తున్నారని, ఐటీ దాడుల్లో రూ. 42 కోట్లు దొరికినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తనదైన శైలిలో స్పందించారు మంత్రి కేటీఆర్. “కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఓట్లను కొనుగోలు చేయడానికి ఇక్కడికి వందల కోట్ల రూపాయాలను పంపిస్తోంది. దీనికి ఓటుకు నోటు కేసులో కెమెరాకు చిక్కిన టీపీసీసీ చీఫ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇది మేం ముందే ఊహించాం” అంటూ రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేటీఆర్. మరి కేటీఆర్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.