iDreamPost

కాంగ్రెస్ కు పొన్నాల రాజీనామా! BRS టికెట్ ఖాయమా?

  • Author Soma Sekhar Updated - 07:43 PM, Fri - 13 October 23
  • Author Soma Sekhar Updated - 07:43 PM, Fri - 13 October 23
కాంగ్రెస్ కు పొన్నాల రాజీనామా! BRS టికెట్ ఖాయమా?

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే అధికార భారాసా పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలను ఇరకాటంలోకి నెట్టేసింది. కాగా ఎన్నికలు మరింత దగ్గరపడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇక పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్తాను అనడంతో.. పొన్నాలకు భారాసా నుంచి టికెట్ ఖాయమా? అన్న సందేహాలు లేవనెత్తుతున్నారు కొందరు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింతగా హీటెక్కనున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి, మాజీ టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. ఈ మేరకు తన రాజీనామా లెటర్ ను మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇక జనగామ టికెట్ ను కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో.. పొన్నాల అసహనం వ్యక్తం చేసి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు యూటర్న్ తీసుకున్నాయి.

అదీకాక పొన్నాల ఇంటికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెళ్తాననడం, ఆయన పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తానని చెప్పడం ఆసక్తిగా మారింది. దీంతో జనగామ టికెట్ పొన్నాలకు ఖాయం అన్న గుసగుసలు ఇప్పటికే మెుదలైయ్యాయి. త్వరలోనే కేటీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. కాగా.. జనగామ నుంచి నాలుగు సార్లు పొన్నాల గెలుపొంది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. మరి పొన్నాల రాజీనామాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి