తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. 'అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ'లో ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. 'అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ'లో ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’కు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేశారు. దీంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా బిగ్ టర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ అధికారంలోకి వస్తే.. తెలంగాణకు బీసీ సీఎం అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగింది బీజేపీ. తాజాగా ఎస్సీ వర్గీకరణపై సంచలన ప్రకటన చేసి.. రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చింది.
హైదరాబాద్ వేదికగా ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’ శనివారం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరైయ్యారు. ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ సభకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ..”ఎస్సీ వర్గీకరణకు మేం కట్టుబడి ఉన్నాం. మీ పోరాటంలో న్యాయం ఉందని మేం భావిస్తున్నాం. అందుకే మీకు మా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నా. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి న్యాయపరమైన ప్రక్రియ సుప్రీం కోర్టులో ఉంది. మాదిగలకు మేం న్యాయం చేస్తాం” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి త్వరలోనే కమిటీ వేసి, న్యాయం చేస్తామని సభాముఖంగా మోదీ తెలియజేశాడు. కాగా.. గతంలో మోదీ బీసీ సభకు హైదరాబాద్ వచ్చిన సమయంలో మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ అంశంపై మోదీతో మాట్లాడారు. అప్పుడే మోదీ సానుకూలత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. తాజాగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్నాం అని మోదీ ప్రకటన ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.