iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ అభ్యర్థిగా దిల్ రాజు? ఆ లోక్‌సభ స్థానం నుంచి పోటీ?

  • Published Dec 30, 2023 | 12:28 PM Updated Updated Dec 30, 2023 | 12:28 PM

Dil Raju Political Entry: టాలీవుడ్ లో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ ఆయన రాజకీయ ఎంట్రీపై అనేక వార్తలు వినిపిస్తోంటాయి. తాజాగా మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

Dil Raju Political Entry: టాలీవుడ్ లో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ ఆయన రాజకీయ ఎంట్రీపై అనేక వార్తలు వినిపిస్తోంటాయి. తాజాగా మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

  • Published Dec 30, 2023 | 12:28 PMUpdated Dec 30, 2023 | 12:28 PM
కాంగ్రెస్ అభ్యర్థిగా దిల్ రాజు? ఆ లోక్‌సభ స్థానం నుంచి పోటీ?

రాజకీయాలకు, సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉందనేది  ఎక్కువ మంది చెప్పే మాట. కారణం..ఇండస్ట్రీలోని ఎంతోమంది ప్రముఖులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ లాంటి పెద్ద నటుడు పార్టీ పెట్టి ఏకంగా సీఎం అయ్యారు. అలానే కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవీ, జయప్రద, జయసుధ..వంటి ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశించి..సక్సెస్ అయ్యారు. నేటికి అలీ, పోసాని కృష్ణమురళి వంటి ఎంతో మంది నటులు పొలిటికల్ గా ఉన్నారు. తాజాగా ఓ బడా నిర్మాత గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ నిర్మాత ఎవరు ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడైనా హీరోలకు, హీరోయిన్లకు అభిమానులు ఉంటారు. వారిని చూసే సినిమాలకు వచ్చే ప్రేక్షకులే ఎక్కువగా ఉంటారు. అయితే ప్రొడ్యూసర్లను చూసి సినిమాకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. కానీ దిల్ రాజ్ క్రేజ్ మాత్రం వేరే లెవల్. ఆయన నిర్మిస్తున్న సినిమా అంటే చాలు.. నటీనటులతో సంబంధం లేకుండా ఆడియన్స్ థియేటర్లకు వెళ్తుంటారు. అంతలా ప్రేక్షకుల్లో తనదైన మార్క్ ను దిల్ రాజు వేశారు.

ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఘనత దిల్ రాజు ది.  వెంకట రమణారెడ్డిగా ఉన్న ఆయన దిల్ సినిమాను నిర్మించి.. సూపర్ హిట్ కొట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి.. ఆ సినిమా పేరునే తన పేరుగా మార్చుకున్నారు. అప్పటి నుంచి దిల్ రాజుగా మారి.. ఇండస్ట్రీల్లోనే రారాజుగా కొనసాగుతున్నారు. కొత్త దర్శకులను, నటీనటులను, రచయితలను పరిచయం చేయడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. ఇలా  సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో వార్తలు వస్తున్నాయి.

గతంలో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ భావించారు. అంతేకాక నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నుంచి దిల్ రాజు పోటీ చేస్తారని అప్పట్లో టాక్ కూడా వినిపించింది. అయితే ఆ వార్తలపై దిల్ రాజు ఖండించారు. తాను ఏ పార్టీ తరపున, ఏ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఇప్పట్లో రాజకీయలపై ఆసక్తి లేదని, టైమ్ వచ్చినప్పుడు చూద్దాం.. అంటూ చెప్పుకొచ్చారు. అయితే  ఇటీవలే తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దిల్ రాజు చెప్పినట్లే.. ఆయన ఎక్కడ పోటీ చేయలేదు. అయితే తాజాగా మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి దిల్ రాజు పేరు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి దిల్ రాజు చేరబోతున్నాడని..ఈయన త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండనున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. ఆయన సొంత జిల్లా అయినా నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడనే ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. మరి.. ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ అంత దీని గురించే చర్చించుకుంటున్నారు. మరి.. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే.. లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు ఎదురు చూడక తప్పదు. మరి. దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş