బతికేది సాధారణ కిరాణాకొట్టు మీద.. ఆన్ లైన్ బెట్టింగ్‌ లో రూ.2 కోట్లు పోగొట్టి!

Nalgonda Crime News: ఈ మధ్య కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి లైఫ్ లో సెటిల్ అయ్యిపోవాలని చూస్తున్నారు. కష్టపడితే ఆ డబ్బు సంపాదించడం కష్టం.. అందుకే ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్స్ కి అలవాటు పడుతున్నారు.

Nalgonda Crime News: ఈ మధ్య కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి లైఫ్ లో సెటిల్ అయ్యిపోవాలని చూస్తున్నారు. కష్టపడితే ఆ డబ్బు సంపాదించడం కష్టం.. అందుకే ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్స్ కి అలవాటు పడుతున్నారు.

ఇటీవల చాలా మంది డబ్బు సంపాదించడానికి సులువైన మార్గాలు ఎంచుకుంటున్నారు. టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్‌తో లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. కొంతమంది మాత్రం ఆశకు పోయి కోట్లలో అప్పులు చేస్తూ అవి తీర్చే స్థోమత లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. కష్టపడకుండా ఫోన్ లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బు మీ సొంతం చేసుకోవచ్చు అంటూ యూజర్లను ఆకట్టుకుంటున్నారు. అలాగా ఇన్‌స్ట్రంట్ లోన్స్ ఇస్తామంటూ ఆశ చూపించి అడ్డగోలుగా ఫైన్లు వేస్తూ కస్టమర్ల నుంచి డబ్బు దండుకుంటున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ లో కోట్లు పోట్టుకొని అప్పుల వాళ్ల భాద తట్టుకోలేక ఓ వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్స్‌తో కష్టపడకుండా ఉన్నచోటే కూర్చొని ఈజీగా డబ్బు సంపాదించవొచ్చు అంటూ యూజర్లను ఆకట్టుకొంటున్నారు. ఇందులో సంపాదించేది కొంతైతే.. పోగొట్టుకునేదే ఎక్కువ. తాజాగా ఆన్ లైన్ బెట్టింగ్ కోసం ఓ వ్యాపారి అప్పులు చేసి మరీ ఖర్చుపెట్టాడు. చివరికి అంతా పోగొట్టుకొని అప్పుల వాళ్ల భాద భరించలేక ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన తడకమల్ల సోమయ్య కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అతని కుమారులు సాయి కుమార్ (28), సంతోష్ వ్యాపారంలో సహాయంగా ఉండేవారు. ఇటీవల సాయికుమార్ ఆన్ లైన్ బెట్టింగ్స్ ఆడుతూ దానికి బానిసయ్యాడు.  దాదాపు రూ.2 కోట్ల వరకు అప్పు చేసి మరి బెట్టింగ్ లో పెట్టాడు. పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదు.. తీసుకున్న అప్పు తీర్చలేని పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఈ నెల 14న బయటకు వెళ్లిన సాయికుమార్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు వెంటనే చుట్టుప్కల వాళ్ల, బంధువులను, స్నేహితులను వాకబు చేశారు.

తమకు తెలియదని చెప్పడంతో సంతోష్ 17న నల్లగొండలోని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ ప్రారంభించగా హాలియా చెక్ పోస్ట్ వద్ద 14వ మైలు రాయి సమీపంలో సాయికుమార్ సెల్ ఫోన్ సిగ్నల్ కనిపించాయి. సాగర్ కాల్వ వద్ద బైక్, సెల్ ఫోన్ వదిలేసి కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సాయికుమార్. అప్పటి నుంచి పోలీసులు గాలించగా సూర్యపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ సమీపంలోని సాగర్ ఎడమ కాల్వలో మృతదేహం తేలడంతో పెన్ పహాడ్ పోలీసులు మృతుడి కుటుంబీకులు సమాచారం అందించారు. బంగారం లాంటి భవిష్యత్ ముందుకు ఉంచుకొని ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది.

Show comments