కన్నీరు పెట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.. కాపాడండి అంటూ..!

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ఇళ్లల్లోకి వరద చేరుతోంది. దీని కారణంగా ప్రజలు ఇంట్లో ఉండలేని దిక్కు తోచని పరిస్థితుల్లో ఇంటి స్లాబ్ ఎక్కి సాయం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ భారీ వర్షాలకు ఇప్పటికీ ఎంతో మంది ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల్లో కొట్టుకుపోయారు. దీంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలకు నీట మునిగాయి. ఇక ములుగు జిల్లాలో సైతం చాలా ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంటోంది. దీంతో కొన్ని గ్రామాల ప్రజల ఆచూకి కనిపించడం లేదు. ఏటూరు నాగారం కొండాయి గ్రామంలో సుమారు 100 మంది వరదల్లో చిక్కుకుని, ఆరుగురు గల్లైంతనట్లు తెలిస్తుంది. ఈ నేపథ్యంలోనే ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆ ప్రాంతంలో పర్యటించారు. అక్కడున్న వారిని కాపాడేందుకు బృందాలతో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సీతక్క మీడియాతో మాట్లాడుతూ… కనిపించకుండాపోయిన వారిని రక్షించాలని మేము ప్రభుత్వాన్ని కోరాము. దీంతో పాటు ఓ హెలీకాప్టర్ ఇక్కడికి పంపిస్తే ప్రజలను సురక్షితంగా రక్షించవచ్చని ఆమె తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్, సత్యవతి రాథోడ్ లతో మాట్లాడాము. వాగు దాటం NDRFబృందంతో కూడా కావడం లేదు. దాదాపు 100 మంది ప్రజలు డేంజర్ జోన్ లో ఉన్నారు. ప్లీజ్.. వారిని కాపాడాలంటే ఖచ్చితంగా ఓ హెలీకాప్టర్ పంపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటూ ఎమ్మెల్యే సీతక్క మీడియాతో తెలిపింది. ఇదే సమయంలో సీతక్క మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఇది కూడా చదవండి: భారీ వర్షాలకు కృష్ణా నదిలో కొట్టుకు వచ్చిన మొసళ్లు

Show comments