iDreamPost
android-app
ios-app

రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఈ జిల్లాలోనే!

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ సెలవు ఈ జిల్లాలోనే వర్తించనుంది.

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ సెలవు ఈ జిల్లాలోనే వర్తించనుంది.

రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఈ జిల్లాలోనే!

తెలంగాణలో రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర ఎంతటి ప్రసిద్ధి పొందిందో వేరే చెప్పక్కర్లేదు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తికెక్కింది. ప్రకృతిలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులపాలిట కొంగుబంగారమైన అడవి తల్లులను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలో ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర మొదలైంది. అన్ని దార్లు మేడారం వైపే పయనిస్తున్నాయి. మేడారం జాతరకు వచ్చే భక్తులతో రోడ్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ఈ జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

సమ్మక్క-సారలమ్మ జాతర మేడారంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతరను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. రేపు అనగా ఫిబ్రవరి 23న పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కాదు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యాసంస్థలకు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలకు ఈ సెలవు వర్తిస్తుందని వెల్లడించింది. ఇక ములుగు జిల్లా వ్యాప్తంగా మేడారం జాతర జరిగే నాలుగు రోజులు అనగా ఫిబ్రవరి 21,22,23,24 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.