iDreamPost
android-app
ios-app

ప్రాణాలు కోల్పోయి అమ్మ! పరీక్ష రాస్తూ కూతురు! కన్నీరు పెట్టించే ఘటన!

యువతికి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంటికి దూరంగా ఉంటూ చదువుకుంటున్న ఆమె.. ఎగ్జామ్స్ అయిపోయాక, ఇంటికి వెళ్లొచ్చని భావించింది. ఆఖరి పరీక్ష రాసి బయటకు వచ్చిన ఆమెకు పిడుగు లాంటి వార్త..

యువతికి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంటికి దూరంగా ఉంటూ చదువుకుంటున్న ఆమె.. ఎగ్జామ్స్ అయిపోయాక, ఇంటికి వెళ్లొచ్చని భావించింది. ఆఖరి పరీక్ష రాసి బయటకు వచ్చిన ఆమెకు పిడుగు లాంటి వార్త..

ప్రాణాలు కోల్పోయి అమ్మ! పరీక్ష రాస్తూ కూతురు! కన్నీరు పెట్టించే ఘటన!

ఆమెకు తండ్రి లేడు. తల్లి రెక్కల కష్టం మీదే ఆ కుటుంబం గడుస్తోంది. ఈ విషయం తెలిసిన కూతురు ఇంటికి దూరంగా ఉంటూ శ్రద్ధగా చదువుకుంటుంది. ఇటీవల ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. బాగా ప్రిపేర్ అవుతుంది. గురువారం చివరి పరీక్ష. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి అమ్మతో, సోదరుడితో గడపొచ్చు.. అమ్మ కష్టంలో చేదోడు వాదోడుగా ఉండొచ్చు అని భావించింది ఆ యువతి. ఎగ్జామ్ బాగా రాశాక పరీక్ష హాల్ నుండి వచ్చిన యువతి.. తన తల్లి సెంటర్ బయట వెయిట్ చేస్తుందని భావించింది. ఆత్రంతా బయటకు వచ్చి చూస్తే.. ఆమె బంధువులు వచ్చారు. అంతలో అమ్మ ఏదీ అని ప్రశ్నించగా.. గుండెలు బద్ధలైపోయే విషయం చెప్పారు ఆమెకు. తల్లి లేదని, ఇక తిరిగి రాదని చెప్పడంతో.. కన్నీరు మున్నీరు అయ్యింది ఆ యువతి.

ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి ముందే తెలిసినా, ఆమె భవితవ్యం పాడైపోకూడదన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని ఆమె పరీక్ష అయిపోయేంత వరకు దాచారు. ఆమె పరీక్షలు బాగా రాసేలా సపోర్టు చేశారు. హృదయ విదారకమైన ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లంపల్లి గ్రామానికి చెందిన రొంటాల రమాదేవి భర్త కరోనా సమయంలో మృతి చెందారు. ఆమెకు కూతురు సౌమ్య, కొడుకు ఉన్నారు. సౌమ్య జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం దామెర కుంట సోషల్ వెల్ఫేర్ కళాశాలలో బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. సెలవులకు ఇంటికి వచ్చేది సౌమ్య. ఇటీవల తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మొదలు కాగా.. పరీక్షలు బాగా రాస్తోంది సౌమ్య.

కాగా, తల్లి రమాదేవికి అనారోగ్యం బారిన పడటంతో.. దవాఖానాలో చూపించుకోవడానికి కొడుకును తీసుకుని బయలు దేరింది. బుధవారం కొడుకును తీసుకుని ములుగు ఆసుపత్రికి వెళ్లి.. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో రమాదేవి అక్కడిక్కడే మృతి చెందగా.. ఆమె కొడుక్కి గాయాలయ్యాయి. సౌమ్య తల్లి మరణవార్తను కుటుంబ సభ్యులు కాలేజీకి తెలియజేశారు. అయితే గురువారం చివరి పరీక్ష ఉండటంతో.. ఈ విషయం తెలిస్తే, విద్యార్థిని ఎక్కడ డిస్ట్రబ్ అవుతుందో అని సౌమ్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. కుటుంబ సభ్యుల ఆమోదంతో తల్లి మరణ వార్తను ఆమెకు చెప్పలేదు. ఎగ్జామ్ రాశాక.. అమ్మ వస్తుందని ఆశ పడ్డ ఆమెకు.. తల్లి మరణ వార్త చేరింది. తల్లి చనిపోయిందని తెలియగానే.. సౌమ్య కన్నీరుమున్నీరు అయ్యింది. ఆమెను ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. ఆమె పరిస్థితి చూసి.. కన్నీరు పెట్టుకుంటున్నారు. పగ వాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని అనుకున్నారు.