P Krishna
Massive Tree Fall in Medaram Forest: బంగాళా ఖాతంలో అల్ప పీడనం కారనంగా ఏపీ, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో వడగాలులు బీభత్సం సృష్టించాయి.
Massive Tree Fall in Medaram Forest: బంగాళా ఖాతంలో అల్ప పీడనం కారనంగా ఏపీ, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో వడగాలులు బీభత్సం సృష్టించాయి.
P Krishna
ప్రస్తుతం తెలంగాణను వరుణ దేవుడు వదిలిపెట్టేలా కనిపించడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి వరుద నీరు వచ్చి చేరడంతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. కొన్ని గ్రామాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని కమ్యూనికేషన్ లేకుండా పోయింది. తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు పడుతున్న సమయంలో అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో భారీ వృక్షాలు నేలమట్టం అయ్యాయి. దాదాపు 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ఒకే చోట మూడు కిలోమీటర్ల విస్తరించి ఉన్న దాదాపు 50 వేల భారీ వృక్షాలు నేటమట్టమయ్యాయి. అంత పెద్ద వృక్షాలు వేల సంఖ్యల్లో కూలిపోవడం చూస్తుంటే సుడిగాలి ఏ రేంజ్ లో వచ్చిందో అర్థమవుతుందని అధికారులు అంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి బీభత్సం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.
ఈ నెల 1వ తేదీన పరిశీలనకు వెళ్లిన అధికారులు, స్థానికులు భారీ వృక్షాలు నేట మట్టం కావడం చూసి షాక్ తిన్నారు. టోర్నడోల కారణంగానే ఈ చెట్లు కూలి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వృక్షాలు కూలిన పరిస్థితి చూస్తే కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చి ఉంటాయని అధికారులు తెలిపారు. అయితే ఏక కాలంలో ఒకే చోట 50 వేలకు పైగా చెట్లు కూలడం పై సమగ్ర విచారణ జరుపుతామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయని అంటున్నారు. వర్షాల కారణంగా జలాశయాలు, చెరువులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.