iDreamPost

భారీ వర్షాలకు కృష్ణా నదిలో కొట్టుకు వచ్చిన మొసళ్లు

భారీ వర్షాలకు కృష్ణా నదిలో కొట్టుకు వచ్చిన మొసళ్లు

దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా గ్రామాలు వరద నీటితో నిండిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ లో చాలా మటకు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. మేడారంలోని సమ్మక్క సారక్క జాతర ప్రాంగంణం అంతా వరద నీరు చేరిపోయింది. ఈ భారీ వర్షాలకు ప్రజలు అడుగు బయట పెట్టిలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమై NDRF బృందాలను అందుబాటులో ఉంచారు. ఇదే కాకుండా అధికారులు అవసరమైన లోతట్టు ప్రాంతాలకు హెలీకాప్టర్లను సైతం అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని నారాయణపెట్ జిల్లా మక్తల్ మండలం పసుపుల గ్రామం వద్ద కృష్ణా నది పరిహాక ప్రాంతంలో చాలా మొసళ్లు చేరాయి. వీటిని చూసి ప్రజలను భయందోళనకు గురవుతున్నారు. అయితే, ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు మొసళ్లు నదిలో కొట్టుకు రావడంతో స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తమై వెంటనే ఆ మొసళ్లను అక్కడి నుంచి తరిమి కొట్టినట్లు తెలుస్తుంది. దీంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోసల్ మీడియాలో కాస్త వైరల్ గా మారతున్నాయి.

ఇది కూడా చదవండి: రెయిన్ ఎఫెక్ట్: సెలవులను రద్దు చేసిన ప్రభుత్వం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి