iDreamPost
android-app
ios-app

తెలంగాణ BJPకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి విజయశాంతి?

తెలంగాణలో ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో కీలక నేతల రాజీనామాలతో ప్రధాన పార్టీలకు షాక్ లు తగులుతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది.

తెలంగాణలో ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో కీలక నేతల రాజీనామాలతో ప్రధాన పార్టీలకు షాక్ లు తగులుతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది.

తెలంగాణ BJPకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి విజయశాంతి?

తెలంగాణ ఎన్నికల్లో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.  పొలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్ది.. నాయకులు అటు ఇటు పార్టీలు మారుతున్నారు. ఫలానా పార్టీ అని లేకుండా.. అన్ని పార్టీల నుంచి జంపింగ్స్, జాయినింగ్స్ జరుగుతున్నాయి. అయితే పెద్ద నాయకులు పార్టీలకు రాజీనామాలు చేస్తుండటంతో ఆయా పార్టీలకు  గట్టి దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తలిగిలింది. ఆ పార్టీ నేత , మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో  చేరనున్నారు. నేడో, రేపో ఆమె కాంగ్రెస్ లో చేరుతారని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ధ్రువికరించారు. కొద్ది కాలంగా విజయశాంతి బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సభలకు ఆమె హాజరు కాలేదు.

సీనియర్‌ సినీ నటి, మెదక్‌ మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల బాబితాలో ఆమె పేరు లేదు. అంతేకాక ఆమె చాలాకాలంగా పార్టీ పట్ల అసంతృప్తి ఉన్నారు. అందుకే ఇటీవల జరిగిన బీజేపీ అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనలేదు. అభ్యర్థుల జాబితాతో పాటు స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలోనూ విజయశాంతి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విజయశాంతి.. అదే ఏడాది డిసెంబర్‌లో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. అలా ఇప్పటి వరకు బీజేపీలో ఆమె ప్రయాణం కొనసాగింది. తాజాగా బీజేపీలో అసంతృప్తితో ఉన్న కారణంగా ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, టీపీసీసీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లు రవి ఈ విషయాన్ని ధృవీకరించారు. విజయశాంతి 1998లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు. 1999 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీపై విజయశాంతి బీజేపీ తరఫున పోటీ చేయాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ పోటీ చేయకపోవడంతో విజయశాంతి కూడా తప్పుకున్నారు. అలా  దాదాపు పదేళ్ల పాటు బీజేపీలోనే కొనసాగిన విజయశాంతి 2009లో బయటకు వచ్చింది. తల్లీ తెలంగాణ అనే సొంత పార్టీని స్థాపించారు. కొన్ని రోజులకు ప్రస్తుతం బీఆర్ఎస్.. అప్పటి టీఆర్ఎస్ లో పార్టీని విలీనం చేశారు. 2009లో టీఆర్ఎస్ తరపున మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి..విజయం సాధించారు.