iDreamPost
android-app
ios-app

ఆ నియోజక వర్గంలో పోటీ చేసేందుకు జీవిత రాజశేఖర్ దరఖాస్తు!

  • Published Sep 10, 2023 | 6:48 PM Updated Updated Sep 10, 2023 | 6:48 PM
  • Published Sep 10, 2023 | 6:48 PMUpdated Sep 10, 2023 | 6:48 PM
ఆ నియోజక వర్గంలో పోటీ చేసేందుకు జీవిత రాజశేఖర్ దరఖాస్తు!

జీవిత, రాజశేఖర్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరు అనేక సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలానే జీవిత పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక రాజశేఖర్ అయితే ఇప్పటికి పలు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. వారి కుమార్తెలు కూడా ప్రస్తుతం సినిమాలో నటిస్తున్నారు. పెద్ద కుమార్తె.. శివాత్మిక కూడా పలు చిత్రాలో నటించింది. ఈ దంపతులు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉన్నారు. పలు పార్టీలు మారి..ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. త్వరలో తెలంగాణలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపు నుంచి పోటీ చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే బీజేపీ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానించింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. పలువురు ముఖ్యనేతల కూడా తమ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోని నటులు జీవిత రాజశేఖర్ నాలుగు నియోజకవర్గాలకు ఆమె దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్, సనత్ నగర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల జీవిత రాజశేఖర్ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారని సమచారం.

అంతేకాక ఈ నాలుగు నియోజకవర్గాలు లేకపోయినా పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపినట్లు సమాచారం. ఆమె గత కొంతకాలం నుంచి బీజేపీలో ఫుల్ యాక్టీవ్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలో పాల్గొంటూ నాయకుల దృష్టిలో పడుతున్నారు. వివిధ సందర్భాలో మీడియా ముందుకు వచ్చి.. పార్టీ తీసుకున్న నిర్ణయాలపై , మోదీపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే  జీవిత,రాజేశేఖర్ దంపతులు కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని టాక్ వినిపించింది. అందుకు తగినట్లే తాజాగా వారు కూడా ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరి..  జీవిత రాజశేఖర్ ఈ నాలుగు నియోజకవర్గాలో అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రాబోయే వంద రోజులు సోనియమ్మ మాల వేసుకుందాం..

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet