iDreamPost
android-app
ios-app

రాబోయే వంద రోజులు సోనియమ్మ మాల వేసుకుందాం..

  • Published Sep 10, 2023 | 1:01 PM Updated Updated Sep 10, 2023 | 1:01 PM
  • Published Sep 10, 2023 | 1:01 PMUpdated Sep 10, 2023 | 1:01 PM
రాబోయే వంద రోజులు సోనియమ్మ మాల వేసుకుందాం..

తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకూడు పెంచింది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. దీనిలో భాగంగానే హైదరాబాద్ లో జిల్లా, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు శిక్షణ శిభిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ తో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. పార్టీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రానున్న వంద రోజులు కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. దీనికోసం ప్రతిఒక్క కార్యకర్త అకుంటిత దీక్షతో కష్టపడాలని కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరుగుతు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.

రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షపార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విల్లూరుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్, ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రజల్లో కలియతిరుగుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయ్యప్ప, శివమాల మాదిరిగా సోనియమ్మ మాల ధరించాలని కోరాడు. వంద రోజులు కాంగ్రెస్ దీక్ష చేయాలని వెల్లడించాడు. 90 లక్షల ఓట్లు తెచ్చుకుంటే.. 90 సీట్లు గెలవడం పెద్ద కష్టమేమీ కాదని రేవంత్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా ఈ సారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికోసం ప్రతీ కార్యకర్త అంకితాభావంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet