iDreamPost
android-app
ios-app

తెలంగాణ ఎన్నికల వేళ జనసేనకు ఊహించని షాక్!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి బిగ్ షాక్ తగిలింది. జనసేన వాడుకునే గ్లాస్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి బిగ్ షాక్ తగిలింది. జనసేన వాడుకునే గ్లాస్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఎన్నికల వేళ జనసేనకు ఊహించని షాక్!

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా సాగుతోంది. నేటితో నామినేషన్లు వేయడం ముగియడంతో.. అన్ని పార్టీలు ప్రచారంలో బిజీ అయ్యాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తూ దూసుకెళ్తున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు బిగ్ షాక్ తగిలింది.  టీఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి  ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గానే  కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో  ఆ పార్టీ తరపున పోటీ చేసే వాళ్లందరూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.

జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో క్రియశీల పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. జనసేన 8 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే ఆ ఎనిమిది మంది అభ్యర్థులను  జనసేన పార్టీ ప్రకటించింది. మరీ ముఖ్యంగా ఎనిమిది నియోజకవర్గాల్లో గ్రేటర్‌ పరిధిలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న కూకట్‌పల్లిని బీజేపీ జనసేనకు కేటాయించింది. మంగళవారం బీజేపీ నిర్వహించిన బీసీ ఆత్మీయ సభకు ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆయనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కూడా ఈ సభకు హాజరయ్యారు. అనంతరం బీజేపీ తరపున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ఇలాంటి తరుణంలో తెలంగాణలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన పార్టీకి సంఘం పార్టీ సింబల్ కేటాయించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రాష్ట్రంలో జనసేనకు ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లేదు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్ధులు ఇండిపెండెంట్‌గా బరిలో దిగనున్నారు. అయితే వీరందరికి ఈసీ ఒకే గుర్తు కేటాయిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక జనసేన పార్టీ అంటే గ్లాస్.. గ్లాస్ అంటే జనసేన అనేంతలా ప్రజల్లో బలంగా పాతుకు పోయింది. మరీ ఈ గుర్తు ఎన్నికల్లో లేకపోవడం జనసేనకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. మరి.. జనసేనకు తెలంగాణలో గ్లాస్ గుర్తు కేటాయించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.